iDreamPost
android-app
ios-app

నాని- బలగం వేణు టైటిల్ కూడా రివీల్ చేసిన దిల్ రాజు!

  • Published Mar 07, 2024 | 10:07 PMUpdated Mar 07, 2024 | 10:07 PM

Balagam Venu Movie Title Revealed: జబర్ధస్త్ లో తనదైన కామెడీ పండించిన వేణు ‘బలగం ’ మూవీతో డైరెక్టర్ గా మారారు. త్వరలో నానీ-వేణు క్రేజీ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది.

Balagam Venu Movie Title Revealed: జబర్ధస్త్ లో తనదైన కామెడీ పండించిన వేణు ‘బలగం ’ మూవీతో డైరెక్టర్ గా మారారు. త్వరలో నానీ-వేణు క్రేజీ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది.

  • Published Mar 07, 2024 | 10:07 PMUpdated Mar 07, 2024 | 10:07 PM
నాని- బలగం వేణు టైటిల్ కూడా రివీల్ చేసిన దిల్ రాజు!

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త దర్శకులు హవా నడుస్తుంది. తెగుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన నటుడు వేణు వెండితెరపై తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన వేణు సడెన్ గా డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఎవరూ ఊహించని విధంగా ‘బలగం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం చూసిన తర్వాత మేగాస్టార్ చిరంజీవి.. వేణు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నాడు. ఈ మూవీ మంచి హిట్ కావడంతో వేణుకి పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నానితో ఓ మూవీ తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కమెడియన్ నుంచి ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగాడు వేణు యెల్దండి. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో ఓ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీకి ఎల్లమ్మ అంటూ ఓ మాస్ టైటిల్ కూడా పెట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత దిల్ రాజు వెల్లడించడం మరో విశేషం. గత కొంతకాలంగా వేణు డైరెక్షన్ లో నాని ఓ సినిమా తీయబోతున్నాడంటూ తెగ వార్తలు వస్తున్నాయి. లవ్ మీ మూడీ టీజర్ లాంచ్ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. అప్పట్లో పలు సందర్భాల్లో వేణుతో ఓ మూవీ ఉండబోతుందని నాని కూడా చెప్పాడు.

నేచురల్ స్టార్ నానీ, వెణు యెల్దండి మూవీ అప్డేట్ ఏంటీ అన్న ప్రశ్నకు.. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అవును ఆ మూవీ ఫైనల్ అయ్యింది.. ఎల్లమ్మ వస్తది ’ అంటూ చెప్పడం విశేషం. దిల్ రాజు ఇచ్చిన అప్ డేట్ తో నాని ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. మాస్ ఎలిమెంట్స్ తో రాబోయే ఈ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు కూడా పెరిగిపోయాయి. మొత్తానికి నాని – వేణు క్రేజీ కాంబినేషన్ రావడమే కాదు.. టైటిల్ కూడా ఫిక్స్ కావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. దసరా మూవీతో ఊరమాస్ గా కనిపించిన నాని మరి ఎల్లమ్మ లో ఏ రేంజ్ లుక్ తో కనిపిస్తాడో అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి