iDreamPost
android-app
ios-app

Balakrishna: మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ!

  • Published Sep 02, 2024 | 3:30 PM Updated Updated Sep 02, 2024 | 3:30 PM

Nandamuri Balakrishna About Mokshagna Debut: నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై కీలక అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పుకొచ్చాడు.

Nandamuri Balakrishna About Mokshagna Debut: నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై కీలక అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పుకొచ్చాడు.

  • Published Sep 02, 2024 | 3:30 PMUpdated Sep 02, 2024 | 3:30 PM
Balakrishna: మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెుత్తం కలిసి, బాలయ్య సినీ స్వర్ణోత్సవాన్ని గ్రాండ్ గా నిర్వహించాయి. హైదరాబాద్ లోని నోవోటెల్ లో ఈ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకకు సౌత్ ఇండస్ట్రీ నుంచే కాక.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ ఎంట్రీపై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నందమూరి మోక్షజ్ఞ.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. త్వరలోనే ఈ నందమూరి వారసుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకోసం ఇప్పటికే నటనలో శిక్షణతో పాటుగా లుక్ ను మార్చుకుంటున్నాడు. మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యతలను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించారు బాలయ్య. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో కథతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తాడని చాలా వార్తలు వినిపించాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో వాటిని కొట్టిపారేస్తున్నారు అభిమానులు.

ఇదిలా ఉండగా.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ పెద్దలు బాలయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై అప్డేట్ ఇచ్చాడు. “మోక్షజ్ఞ సినిమా మరో మూడు నెలల్లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలు అన్నీ వెల్లడిస్తాం. వాడిపై ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీపై నాకు ఎలాంటి టెన్షన్ లేదు. వాడి లైనప్ లో ఐదారు కథలు సిద్ధంగా ఉన్నాయి” అంటూ బాలయ్య ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నందమూరి ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş