iDreamPost
android-app
ios-app

గ్రాండ్ లాంఛ్ లో నాగార్జున ఇచ్చిన హింట్స్ గమనించారా? ఈసారి నెక్ట్స్ లెవల్ ప్లానింగ్..

  • Published Sep 02, 2024 | 2:05 PM Updated Updated Sep 02, 2024 | 2:05 PM

Bigg Boss Telugu Season 8- Nagarjuna Hints On Twists: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇప్పుడు బాగానే చర్చ జరుగుతోంది. అయితే ఈసారి సీజన్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే నాగార్జున కొన్ని ట్విస్టులు హింట్ ఇచ్చారు.

Bigg Boss Telugu Season 8- Nagarjuna Hints On Twists: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇప్పుడు బాగానే చర్చ జరుగుతోంది. అయితే ఈసారి సీజన్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే నాగార్జున కొన్ని ట్విస్టులు హింట్ ఇచ్చారు.

  • Published Sep 02, 2024 | 2:05 PMUpdated Sep 02, 2024 | 2:05 PM
గ్రాండ్ లాంఛ్ లో నాగార్జున ఇచ్చిన హింట్స్ గమనించారా? ఈసారి నెక్ట్స్ లెవల్ ప్లానింగ్..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. అట్టహాసంగా లాంఛింగ్ ఎపిసోడ్ కూడా ప్రసారం అయ్యింది. హౌస్ లో ఏం జరుగబోతోంది? ఎవరు ఎలాంటి స్ట్రాటజీలు వాడబోతున్నారు? అనే ప్రశ్న, ఆసక్తి ఆడియన్స్ లో కచ్చితంగా ఉంటుంది. అయితే నిన్న గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ లో చాలానే ట్విస్టులు రివీల్ చేశారు. అలాగే రాబోయే ట్విస్టులకు సంబంధించి కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా సీజన్ లో రాబోయో పవర్స్ కి సంబంధించి ఈ హింట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా.. వచ్చే కష్టాలు కూడా అదే తరహాలో ఉంటాయని చెప్పకనే చెప్పారు.

బెడ్ రూమ్స్ కి పవర్స్:

గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్లో హౌస్ గురించి ఎప్పటిలాగానే నాగార్జున వివరించారు. అయితే ఈసారి హౌస్ లో జంగిల్ థీమ్ ఉన్న విషయం అర్థమైపోయింది. అంటే ఒక్కో ప్రాంతానికి ఒక్కో తరహా ప్రత్యేకత, పవర్ ఉంటుంది. జిరాఫీ ఉన్న ప్రాంతాన్ని గోల్డెన్ ఏరియా అన్నారు. అక్కడ గెలవడానికి స్ట్రాటజీస్ వేసే వాళ్లు సింహం అని చెప్పారు. అలాగే ఈసారి కూడా 3 బెడ్ రూమ్స్ పెట్టారు. అయితే వాటిని ఎవరికి నచ్చినట్లు వాళ్లు తీసుకోవడానికి లేదు. వాటిలోకి వెళ్లాలి అంటే దానికి తగిన అర్హతలు ఉండాలి.. వాటిని గెలుచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ బెడ్ రూమ్స్ కి పవర్స్ కూడా ఉంటాయని నాగార్జున వెల్లడించారు. అయితే ఎలా పవర్స్ అనేది మాత్రం వచ్చే ఎపిసోడ్స్ లో చూపిస్తారు.

Nagarjuna biggboss

ఈసారి హౌస్ లో ఉన్న 3 బెడ్ రూమ్స్.. వాటి ప్రత్యేకతలు ఇవే. మొదటిగా తూనీగ బెడ్ రూమ్. తూనీగ అనగానే చాలా మంది అదృష్టం అంటారు. అలాగే ఈ హౌస్ లో కూడా తూనీగ అదృష్టానికి గుర్తు. అంటే హౌస్ లో కష్టంతో పాటు అదృష్టం ఉంటేనే ఈ బెడ్ రూమ్ లోకి వెళ్తారు. ఇంక రెండో బెడ్ రూమ్ పీకాక్ బెడ్ రూమ్. హౌస్ లో ఉన్న వారిలో ఆడే స్ట్రెంథ్- ఆ పవర్ ఉంటేనే.. ఈ బెడ్ రూమ్ లోకి వెళ్తారు. ఇంక ఆఖరిది మూడో బెడ్ రూమ్ జీబ్రా బెడ్ రూమ్. జీబ్రాలాగానే ఎవరికీ లొంగకుండా.. మాట పొగరుకి భయపడకుండా ఆటను ఆడేవాళ్లు, హౌస్ లో ఉండేవాళ్లు ఈ బెడ్ రూమ్ లోకి వెళ్తారు అంటూ హోస్ట్ అక్కినేని నాగార్జున వెల్లడించాడు.

ఏదైనా 3 టైమ్స్:

ఈసారి హౌస్ లో చెడు అయినా మంచి అయినా మూడుసార్లు వస్తుంది. అంటే తొలిరోజు ఎపిసోడ్లో హౌస్ మేట్స్ కి 3 బ్యాడ్ న్యూసులు చెప్పారు. నో కెప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ. అలాగే బెడ్ రూమ్స్ ని మూడు పెట్టారు. అంతేకాకుండా.. స్టేజ్ మీద ఉన్న సమయంలో నైనికాకు నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. వచ్చే మూడ్రోజుల్లో ఎవరైనా ముగ్గురు దగ్గరి నుంచి 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ ని తీసుకోవాలి అని చెప్పారు. మీకు ఏ విషయం చూసినా ఈ 3 అంకె అనేది రిపీట్ అవుతూ కనిపిస్తోంది. ఈసారి తొలుత వచ్చిన బిగ్ బాస్ ప్రోమోల్లో నాగార్జునాను జీనీగా చూపించారు కదా.. ఆ జీనీ తరహాలోనే హౌస్ లో ఏదైనా 3 టైమ్స్ ఉంటుంది అని చెప్పకనే హింట్స్ రూపంలో చెప్పేశారు అనిపిస్తోంది. అయితే గుడ్ న్యూస్ అలా 3సార్లు వస్తే బాగానే ఉంటుంది. కానీ, బ్యాడ్ న్యూస్ అలా మూడు రెట్లలో వస్తేనే కష్టం. మరి.. నాగార్జున ఇచ్చిన హింట్స్ మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet