iDreamPost
android-app
ios-app

Naga Chaitanya: నాగచైతన్య మూవీలో నాగార్జున? ఇది ఊహించి ఉండరు..

  • Published Aug 20, 2024 | 9:58 AM Updated Updated Aug 20, 2024 | 9:58 AM

'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో నాగచైతన్య ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యామియోను కింగ్ నాగార్జున చేయబోతున్నారు అనే వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో నాగచైతన్య ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యామియోను కింగ్ నాగార్జున చేయబోతున్నారు అనే వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 20, 2024 | 9:58 AMUpdated Aug 20, 2024 | 9:58 AM
Naga Chaitanya: నాగచైతన్య మూవీలో నాగార్జున? ఇది ఊహించి ఉండరు..

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం చందు మెుండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ మూవీ తర్వాత ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారింది. నాగచైతన్య నటించే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయనున్నాడట నాగార్జున. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇండస్ట్రీలో యంగ్ హీరోల సినిమాల్లో సీనియర్ హీరోలు క్యామియో రోల్స్ చేయడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే ఇలాంటి క్యామియో రోల్స్ లో తండ్రీ కొడుకులు కనిపించడం అన్నది చాలా అరుదు. ఇలాంటి అరుదైన క్యామియోనే త్వరలో టాలీవుడ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తండేల్ మూవీ తర్వాత నాగచైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే?

కార్తీక్ దండు-నాగచైతన్య మూవీలో కథను అనుగుణంగా ఫ్లాష్ బ్యాక్ లో ఓ సీనియర్ హీరో కనిపిస్తాడ. ఆ క్యారెక్టర్ ను నాగార్జున చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్ కేవలం 10 నిమిషాలు మాత్రమే అయినప్పటికీ.. స్కోప్ ఉంటుందట. మరి ఈ మూవీలో నటించడానికి నాగ్ ఒప్పుకుంటాడా? లేడా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక ఈ చిత్రంలో చై లుక్ చాలా కొత్తగా ఉంటుందని టాక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ కాంబినేషన్ ను ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొడుకు మూవీలో తండ్రి క్యామియో చేస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş