iDreamPost
android-app
ios-app

క్రిమినల్ మూవీలో విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే?

నాగార్జున నటించిన బైలింగ్వల్ మూవీల్లో ఒకటి క్రిమినల్. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చున్నప్పటికీ హిట్ కొట్టడం విశేషం. ఇక ఇందులో విలనీకి ప్రతి రూపంగా మారిన నటుడు గుర్తున్నాడా. ఒక్క హ్యాండ్ తోనే హీరోయిన్ మనీషా కొయిరాలాను అత్యంత ఘోరంగా కొట్టి చంపుతాడు..అతడు ఎవరో తెలుసా..?

నాగార్జున నటించిన బైలింగ్వల్ మూవీల్లో ఒకటి క్రిమినల్. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చున్నప్పటికీ హిట్ కొట్టడం విశేషం. ఇక ఇందులో విలనీకి ప్రతి రూపంగా మారిన నటుడు గుర్తున్నాడా. ఒక్క హ్యాండ్ తోనే హీరోయిన్ మనీషా కొయిరాలాను అత్యంత ఘోరంగా కొట్టి చంపుతాడు..అతడు ఎవరో తెలుసా..?

క్రిమినల్ మూవీలో విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే?

శివగా సైకిల్ చెయిన్ లాగి రికార్డులు తిరగరాయాలన్నా, అన్నమయ్యగా అలరించాలన్నా, నిన్నే పెళ్లాడతా అంటూ ప్రియుడిగా మారాలన్నా, మన్మధుడిగా మురిపించాలన్నా అక్కినేని నాగార్జునకే చెల్లు. సీనియర్ నటుల్లో నాలుగు స్థంభాలుగా చెప్పుకునే హీరోల్లో ఆయన ఒకరు. ఈయన రూటే సెపరేట్. ఒక్క జోనర్‌కే కట్టుబడి పోలేదు. ఒక్క ఇండస్ట్రీతో ఆగిపోలేదు. తమిళ్, హిందీ ఇండస్ట్రీల్లో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న నటుడాయన. మణిరత్నం, మహేష్ భట్ వంటి ఇతర ఇండస్ట్రీ టాప్ దర్శకులతో వర్క్ చేశాడు. నాగార్జున నటించిన బై లింగ్వల్‌ మూవీ క్రిమినల్. నాగార్జున, మనీషా కోయిరాలా, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించగా.. శరత్ బాబు, నాజర్ కీ రోల్స్‌లో కనిపించారు. బాలీవుడ్ దిగ్గజ దర్శక నిర్మాత, ప్రముఖ నటి అలియా భట్ తండ్రి మహేష్ భట్ తెరకెక్కించాడు.

ఈ మూవీ తెలుగులో 1994లో విడుదల కాగా, 1995 జులైలో హిందీలో రిలీజ్ చేశారు. నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. సినిమా హిట్ సాధించింది. ఇదే మూవీని తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. క్రిమినల్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది తెలుసా, మనసా ఇది ఏనాటి అనుబంధమో అనే పాట గుర్తుకు వస్తుంది. పాప్కి పాప్కికి బీటే కొట్టు, హల్లోగురు.. కిస్సు కొట్టే గురు, ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యా పోకిరీ సాంగ్స్ టాప్ లేపేశాయి. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీలు అందించాడు. అలాగే సౌండ్ ట్రాక్‌కు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో కేఎస్ రామారావు నిర్మించాడు. ఇక ఇందులో పేరుకు శరత్ కుమార్ విలన్ అయినప్పటికీ.. అసలైన విలన్ క్యారెక్టర్ రాబర్ట్. సింగిల్ హ్యాండ్, ఓ పెట్టుడు చేయితో మనీషా కొయిరాలాను అత్యంత ఘోరంగా కొట్టి చంపేస్తాడు. క్రూరమైన రూపంతో విలన్ అంటే ఇంత భయంకరంగా ఉంటాడా అనిపించేలా యాక్ట్ చేశాడు. అంతలా ఆ భయాన్ని క్రియేట్ చేసిన నటుడు ఎవరంటే గుల్షన్ గ్రోవర్.

బాలీవుడ్‌లో అన్ని నెగిటివ్ రోల్స్ చేయడం వల్ల అతడికి బ్యాన్ మ్యాన్ అన్న ట్యాగ్ కూడా ఉంది. 1980 నుండే ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన తెలుగులో క్రిమినల్ మూవీ కన్నా ముందే ఓ చిత్రంలో నటించాడు. సుమన్ హీరోగా తెరకెక్కిన న్యాయం మీరే చెప్పాలి  అనే చిత్రంలో పరిచయమయ్యాడు గుల్షన్ గ్రోవర్. ఆ తర్వాత క్రిమినల్ మూవీకి వర్క్ చేశాడు. ఈ మూవీతోనే విలన్ అంటే ఇంత భయానకంగా ఉంటాడా.? ఇంత క్రూరంగా చంపేస్తాడా అనేంతలా యాక్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ నటించిన బాలు మూవీలో కూడా యాక్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్‌ను పెంచి పెద్ద చేసేది ఈయనే. ఆ తర్వాత ఏప్రిల్ ఫూల్ అనే చిత్రంలో కనిపించాడు. 2014 తర్వాత ఆయన తెలుగులో నటించలేదు. ఇటీవల భారతీయుడు 2తో పలకరించాడు. ఇందులో అమిత్ అగర్వాల్ అనే పాత్ర పోషించింది క్రిమినల్ విలనే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి