iDreamPost
android-app
ios-app

Naga Chaitanya: తండేల్ వాయిదా పడనుందా? మేకర్స్ వెనక్కి తగ్గడానికి కారణం?

  • Published Jul 19, 2024 | 4:41 PM Updated Updated Jul 19, 2024 | 4:41 PM

నాగచైతన్య-చందు మెుండేటి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 'తండేల్' రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నాగచైతన్య-చందు మెుండేటి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 'తండేల్' రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Naga Chaitanya: తండేల్ వాయిదా పడనుందా? మేకర్స్ వెనక్కి తగ్గడానికి కారణం?

టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి మునుపెన్నడూ నెలకొనలేదనుకుంటా. అంతలా సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. బన్నీ-సుకుమార్ ల పుష్ప 2 ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6 వాయిదా పడిన విషయం తెలిసిందే. దేవర వాయిదా పడినప్పటికీ.. వెనక్కి వెళ్లకుండా ముందుకు వచ్చి ఫ్యాన్స్ ను సంతోషపెట్టింది. ఇక గేమ్ ఛేంజర్ ఇంకా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకోలేదు. పెద్ద సినిమాలు ఎప్పుడు వస్తాయో అన్న క్లారిటీ లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో మరో మూవీ వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నాగచైతన్య-చందు మెుండేటి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘తండేల్’ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

‘తండేల్’.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. చందు మెుండేటి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే లాంఛ్ చేసిన సత్య మేకింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక ఈ మూవీని వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే? తండేల్ మూవీ వాయిదా పడనుందట. దీనికి ప్రధాన కారణం.. డిసెంబర్ లో భారీ సినిమాలు క్యూలో ఉంటమే అని తెలుస్తోంది.

Thandel

డిసెంబర్ 6న పుష్ప 2 మూవీ రానుంది. దాంతో పాటుగా మంచు విష్ణు కన్నప్ప సైతం డిసెంబర్ లోనే వస్తుందని విష్ణు ట్వీట్ చేశాడు. అదీకాక నితిన్ రాబిన్ హుడ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా డిసెంబర్ లోనే బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. దాంతో ఇన్ని సినిమాల మధ్య రావడం కంటే వెనక్కి తగ్గడం మంచిదని మేకర్స్ భావిస్తున్నట్లు వినికిడి. ఇక తండేల్ ను 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో తీసుకురావాలని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉందట. 2018లో గుజరాత్ లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి మేకర్స్ డిసెంబర్ 20నే వస్తారా? లేక వాయిదా వేసుకుంటారా? అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.