iDreamPost
android-app
ios-app

Ravi Teja: మిస్టర్ బచ్చన్.. కన్ఫ్యూజన్ లో మాస్ మహారాజా!

  • Published Jul 19, 2024 | 3:56 PM Updated Updated Jul 19, 2024 | 3:56 PM

హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ఓ పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ఓ పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 19, 2024 | 3:56 PMUpdated Jul 19, 2024 | 3:56 PM
Ravi Teja: మిస్టర్ బచ్చన్.. కన్ఫ్యూజన్ లో మాస్ మహారాజా!

మాస్ మహారాజా రవితేజ.. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. యంగ్ హీరోలకు పోటీగా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ కు ఇది రీమేక్. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మనందరికి తెసిందే. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని, డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉన్న ఈ మూవీకి ఇప్పుడో పెద్ద సమస్య వచ్చిపడింది. మాస్ మహారాజా కన్ఫ్యూజన్ లో పడ్డాడు.

హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడం, ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఆగస్ట్ 15న రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇప్పుడు విడుదల తేదీ విషయంలోనే మాస్ మహారాజా పెద్ద డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి? మూవీ టీమ్ కు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Raviteja

మిస్టర్ బచ్చన్ ను ఆగస్ట్ 15న తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డేట్ కు పూరి జగన్నాథ్-రామ్ ల డబుల్ ఇస్మార్ట్ తో పాటుగా మరో రెండు చిన్న సినిమాలు లాక్ అయ్యాయి. అలాగే విక్రమ్ ప్రయోగాత్మక చిత్రం తంగలాన్ కూడా వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. పోనీ ఆగస్ట్ 2న వద్దాం అంటే.. తక్కువ టైమ్ లో ప్రమోషన్లు కాకపోతే.. ఓపెనింగ్స్ పై భారీ దెబ్బపడుతుంది. ఈ నెల చివరన వద్దామంటే నాని సరిపోదా శనివారంతో కాచుకు కూర్చున్నాడు. అయితే ఇవేమీ పెద్ద సమస్యలు కాదనుకుని బరిలోకి దిగితే.. ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించిన సినిమాలకు ఇబ్బంది అవుతుంది.

ఇన్ని సమస్యల మధ్య మిస్టర్ బచ్చన్ సెప్టెంబర్ కు వెళ్లడమే మంచిదని కొందరి వాదన. అయితే ఆ నెలలో కూడా విడుదలకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. నారా రోహిత్ సుందరకాండ, అల్లరి నరేష్ బచ్చల మల్లి, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఈనెలలోనే విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న ఉండనే ఉంది కాబట్టి.. దాని ముందూ వెనక రావడం కొంత రిస్కే. దాంతో ఇప్పటి వరకు మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ పై కన్ప్యూజన్ కొనసాగుతూనే ఉంది. మరి సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss