Krishna Kowshik
లవ్ బర్స్డ్ నాగ చైతన్య- శోభితా దూళి పాళ నిశితార్థ వేడుక జరిగింది. ఈ విషయాన్ని ట్వీట్ చేశారు చైతూ తండ్రి నాగార్జున. ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా, ఆగస్టు 8నే ఈ జంట పక్షులు ఎందుకు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారంటే..?
లవ్ బర్స్డ్ నాగ చైతన్య- శోభితా దూళి పాళ నిశితార్థ వేడుక జరిగింది. ఈ విషయాన్ని ట్వీట్ చేశారు చైతూ తండ్రి నాగార్జున. ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా, ఆగస్టు 8నే ఈ జంట పక్షులు ఎందుకు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారంటే..?
Krishna Kowshik
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ప్రేయసి, నటి శోభిత ధూళి పాళతో చైతూ నిశ్చితార్థం గురువారం జరిగింది. ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారన్న వార్త నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే. ఈ రూమర్స్ నిజం చేశారు ఈ జంట. చైతూ-శోభిత ఎంగేజ్ మెంట్స్ పిక్స్ షేర్ చేస్తూ అఫీషియల్ ఎనౌన్స్ చేశాడు అక్కినేని నాగార్జున. ఇందులో చైతూ వైట్ షేర్వాణీ ధరించగా.. శోభితా పింక్ శారీలో ముస్తాబయ్యింది. అత్యంత సింపుల్‌గా, కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. కాగా, నాగ చైతన్య గతంలో నటి సమంతను లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి విదితమే. 2017లో వివాహం చేసుకున్న ఈ జంట.. 2021లో విడిపోయింది.
ఆ తర్వాత నటి శోభితాతో ప్రేమలో మునిగిపోయాడు నాగ చైతన్య. ఈ ఇద్దరు కలిసి విదేశాలకు పలుమార్లు షికార్లు చేసిన వార్తలు వినిపించాయి. కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఎక్కడా తమ లవ్ గురించి చైతూ కానీ శోభితా కానీ ఓపెన్ కాలేదు. కానీ ఈ మధ్య చాయ్ (CHAI) అనే వర్డ్ ఉపయోగిస్తూ లాజికల్ స్టేటస్ పెట్టింది అమ్మడు. దీంతో నెటిజన్లు చైతో ఆమె రిలేషన్‌లో ఉందని కన్ఫమ్ అయ్యారు. తాజాగా ఈ జంట పక్షులు ఎంగేజ్ మెంట్‌తో ఒక్కటి అయ్యారని నాగార్జున ట్వీట్ చేశారు. ‘మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం, శోభిత ధూళిపాళతో ఈ రోజు (ఆగస్టు 8న) ఉదయం 9:42 గంటలకు జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెను మా కుటుంబంలోకి చాలా సంతోషంగా స్వాగతిస్తున్నాం. ఈ ఇద్దరికీ అభినందనలు, వారికి జీవితాంత ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8 అంటూ ది బిగినింగ్ ఆఫ్ ఇన్ ఫినిటీ లవ్’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా, నాగ చైతన్య- శోభిత ఆగస్టు 8న వివాహం చేసుకోవడానికి న్యూమరికల్ అండ్ సైంటిఫిక్ రీజన్ కనిపిస్తుంది. ఆగస్టు అంటే ఎనిమిదో నెల, ఎనిమిదో తారీఖు అలాగే.. 2024ను కూడితే.. 8 వస్తుంది. దీన్నే నాగార్జున 8.8.8. అంటూ ప్రస్తావించారు. అలాగే ఎనిమిదిని తిరగేస్తే.. ఇన్ఫిటినిటీ కిందకు వస్తుంది. అంటే దీనికి అంతం లేదు. సో ఈ ప్రేమకు ఎండింగ్ లేదు, ఎప్పుడు కలిసి ఉంటామని చెప్పేందుకు ఈ తేదీలో నిశ్చితార్థం చేసుకున్నారని తెలుస్తుంది. అలాగే బంధం దృఢత్వం గురించి కూడా ఇది సూచిస్తుంది. ఇవన్నీ కలిసి రావడంతోనే ఈ రోజున ఈ ఇద్దరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇక పెళ్లి డేట్ ఎనౌన్స్ చేయలేదు. ఈ ఏడాదిలోనా లేక వచ్చే ఏడాది అనేది అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024