iDreamPost
android-app
ios-app

ఈ తొర్రిపళ్ల చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో తొర్రిపళ్లతో నవ్వులు చిందిస్తున్న చిన్నారి స్టార్ హీరోయిన్. ఒకప్పటి డ్రీమ్ బాయ్, అమ్మాయిల కలల రాకుమారుడి కోడలు. తెలుగులో కేవలం మూడు సినిమాలు చేసింది. ఇంతకు ఆ పాప ఎవరంటే..?

ఈ ఫోటోలో తొర్రిపళ్లతో నవ్వులు చిందిస్తున్న చిన్నారి స్టార్ హీరోయిన్. ఒకప్పటి డ్రీమ్ బాయ్, అమ్మాయిల కలల రాకుమారుడి కోడలు. తెలుగులో కేవలం మూడు సినిమాలు చేసింది. ఇంతకు ఆ పాప ఎవరంటే..?

ఈ తొర్రిపళ్ల చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన ఎంతో మంది చిన్నారులు.. ఆ తర్వాత హీరో, హీరోయిన్లుగా మారిన సంగతి విదితమే. కమల్ హాసన్ మొదలుకుని కావ్య కళ్యాణ్ రామ్ వరకు స్టార్ యాక్టర్స్ బాల నటులుగా అలరించిన వారే. చైల్డ్ ఆర్టిస్టలుగా ఫేమ్ తెచ్చుకున్న నటీనటులంతా.. యంగ్ ఏజ్ వచ్చాక హీరోలు, హీరోయిన్లుగా మారినా.. వారిని సక్సెస్ పలకరిస్తుందని చెప్పడం కష్టం. అందుకు ఉదాహరణ షామిలి. బేబీ షామిలీగా అందరి మనస్సులు దోచేసిన ఈ చిన్నారి.. హీరోయిన్ అయ్యాక ఆకట్టుకోలేకపోయిన సంగతి విదితమే. అలాగే బాలాదిత్య, కౌశిక్ వంటి స్టార్ చైల్డ్ ఆర్టిస్టులు వెండితెరపై రాణించలేకపోయారు. ఇండస్ట్రీలో అందరు శ్రీదేవి, మీనా తరహాలో సక్సెస్ చూడాలంటే కాస్తంత లక్ కూడా కలిసి రావాల్సిందే.

ఈ ఫోటోలో చిన్నది కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది కానీ స్టార్ హీరోయిన్ . కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఒకప్పటి అందాల నటుడు, అమ్మాయిల కలల రాకుమారుడైన హీరో కొడుకును పెళ్లి చేసుకుంది. తెలుగులో మూడంటే మూడు చిత్రాల్లో చేసింది కానీ.. ఆమెకు గుర్తింపు దక్కింది మాత్రం ఒక్కటే. ఈ సినిమా సోసోగా ఆడటంతో తెలుగులో ఆఫర్లు వెల్లువలా వస్తాయనుకున్న ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇంతకు ఆ తొర్రిపళ్ల చిన్నారి ఎవరంటే.. వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే అంటూ నాగ చైతన్య మనస్సును కొల్లగొట్టిన మంజిమా మోహన్. సాహసం శ్వాసగా సాగిపో మూవీలో లీల పాత్రలో మెరిసింది. ఈమె కూడా కేరళ కుట్టినే. ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుండి ఇండస్ట్రీలోకి రావడం ఈజీనే అయ్యింది కానీ.. సక్సెస్ ఇవ్వడంలో మాత్రం ఉపయోగపడలేదు ఆమెకు.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ విపిన్ మోహన్, డ్యాన్సర్ గిరిజల పుత్రిక అయిన మంజిమా అసలు పేరు ప్రియదర్శినీ. ఆమె స్కూల్ స్టడీ అంతా తిరువనంతపురంలో సాగింది. మలయాళ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి.. పది సినిమాల వరకు చేసింది. బుల్లితెరపై కూడా పలు షోస్ చేసింది. డిగ్రీ ఆమె చెన్నైలో చేసింది. 2015లో ఒరు వదక్కన్ సెల్ఫీ మూవీతో మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ చేసిన మంజిమా సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో టాలీవుడ్ నాట తెరగేట్రం చేసింది. ఆ తర్వాత కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో నారా భువనేశ్వరి పాత్రలో మెరిసింది. అటు మలయాళం, తమిళ చిత్రాలు చేసింది. ఓటీటీ వేదికగా బూ అనే చిత్రం చేసింది. ఇది బైలింగ్వల్ మూవీ. 2022లో ప్రముఖ నటుడు కార్తీక్ కొడుకు.. నటుడు గౌతమ్ కార్తీక్ ను వివాహం చేసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి