iDreamPost
android-app
ios-app

Nag Ashwin: ఆ టాలీవుడ్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: నాగ్ అశ్విన్

  • Published Jul 17, 2024 | 3:24 PM Updated Updated Jul 17, 2024 | 3:24 PM

ప్రభాస్ తో కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ టాలీవుడ్ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పుకొచ్చాడు. మరి నాగ్ అశ్విన్ ఎదురుచూసే ఆ మూవీ ఏది? తెలుసుకుందాం పదండి.

ప్రభాస్ తో కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ టాలీవుడ్ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పుకొచ్చాడు. మరి నాగ్ అశ్విన్ ఎదురుచూసే ఆ మూవీ ఏది? తెలుసుకుందాం పదండి.

  • Published Jul 17, 2024 | 3:24 PMUpdated Jul 17, 2024 | 3:24 PM
Nag Ashwin: ఆ టాలీవుడ్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: నాగ్ అశ్విన్

డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రస్తుతం ఈ పేరు ఇండియాతో పాటుగా హాలీవుడ్ రేంజ్ లో గట్టిగా వినిపిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ స్టార్ డైరెక్టర్. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ.. రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. మరి ఇంతటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఓ టాలీవుడ్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఆ విషయాన్ని తాజాగా వెళ్లడించాడు. మరి ఆ మూవీ ఏది?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక్క ఇండియాలోనే గాక.. ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది ఈ తెలుగు మూవీ. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హీసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ఇందులో నటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2, సలార్ 2, యానిమల్ సీక్వెల్స్ లో ఒక అభిమానిగా మీరు ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి నాగ్ అశ్విన్ ఆన్సర్ ఇస్తూ..

“నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు వీరాభిమానిని. అదొక అద్భుతమైన ప్రపంచ, అందులో చాలా హౌస్ లు ఉంటాయి. నాకు సలార్ మూవీ కూడా అలాగే అనిపిస్తోంది. అందుకే నేను ప్రభాస్ సలార్ 2 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. డిఫరెంట్ వరల్డ్ నుంచి వస్తున్న సలార్ కోసం క్యూరియాసిటితో ఉన్నాను” అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. దేవగా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేశాడు. సలార్ పార్ట్ 2 శౌర్యంగా పేరుతో రాబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom