iDreamPost
android-app
ios-app

కార్తీ షూటింగ్‌లో ప్రమాదం.. స్టంట్ మ్యాన్ మృతి

  • Published Jul 17, 2024 | 12:48 PM Updated Updated Jul 17, 2024 | 12:48 PM

Karthi Sardar 2.. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన మూవీ సర్దార్. 2022లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రకటించాడు. ఇప్పుడు సర్దార్ 2 తెరకెక్కుతోంది.

Karthi Sardar 2.. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన మూవీ సర్దార్. 2022లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రకటించాడు. ఇప్పుడు సర్దార్ 2 తెరకెక్కుతోంది.

  • Published Jul 17, 2024 | 12:48 PMUpdated Jul 17, 2024 | 12:48 PM
కార్తీ షూటింగ్‌లో ప్రమాదం..  స్టంట్ మ్యాన్ మృతి

ఓ సినిమా తెరకెక్కాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుండి బొమ్మ తెరపై పడేంత వరకు ఎన్నో రిస్కులు దాటుకుని ప్రేక్షకుల ముందకు చేరుకుంటుంది. కానీ ఈ మధ్యలోనే ఎన్నో ఆటుపోట్లు ఎదురౌతుంటాయి. కొన్ని సార్లు షూటింగ్ సమయంలో ప్రమాదాలు సంభవిస్తుంటాయి. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. తాజాగా తమిళ స్టార్ నటుడు కార్తీ సినిమా షూటింగ్‌ ప్రమాదం జరిగింది. 2022లో కార్తీ హీరోగా వచ్చిన మూవీ సర్దార్. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ అందుకుంది. వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది. సర్దార్ కు సీక్వెల్ ఉంటుందని గతంలో దర్శకుడు పీఎస్ మిత్రన్ వెల్లడించాడు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇటీవల షూటింగ్ స్టార్ అయ్యింది.

జులై 15న చెన్నైలోని సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. భారీ సెట్టింగ్స్ వేశారు. తొలుత యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా స్టంట్ మ్యాన్ మరణించినట్లు తెలుస్తుంది. స్టంట్ మ్యాన్ ఎజుమలై దాదాపు 20 అడుగుల ఎత్తు నుండి కిందకు దూకడంతో మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరు అసిస్టెంట్ స్టంట్ మ్యాన్‌లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరగిన సమయంలో కార్తీ అక్కడే ఉన్నాడని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎంజుమలై‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.

అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్లే మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై హీరో కార్తీక్, దర్శకుడు పీఎస్ మిత్రన్ నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న సర్దార్ 2కి యువన్ శంకర్ రాజా బాణీలు సమకూర్చుతున్నాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో కూడా షూటింగ్ సమయాల్లో ప్రమాదాలు జరిగాయి. శంకర్, కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ సమయంలో కూడా ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించాడు. అలాగే దేవర షూటింగ్ సమయంలో తేనే టీగలు దాడి చేయడంతో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet