iDreamPost
android-app
ios-app

Nag Ashwin: కల్కి రన్ టైమ్ పై విమర్శలు.. నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే?

కల్కి మూవీ రన్ టైమ్ 3 గంటలు ఉండటంతో కొందరు విమర్శించారు. ఇంత లాంగ్ రన్ టైమ్ ప్రేక్షకులకు బోర్ కొట్టదా? అంటూ ప్రశ్నించారు. తాజాగా ఆ విమర్శలకు, ప్రశ్నలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చాడు. ఏమన్నాడంటే?

కల్కి మూవీ రన్ టైమ్ 3 గంటలు ఉండటంతో కొందరు విమర్శించారు. ఇంత లాంగ్ రన్ టైమ్ ప్రేక్షకులకు బోర్ కొట్టదా? అంటూ ప్రశ్నించారు. తాజాగా ఆ విమర్శలకు, ప్రశ్నలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చాడు. ఏమన్నాడంటే?

Nag Ashwin: కల్కి రన్ టైమ్ పై విమర్శలు.. నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే?

‘పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, ఎంత గొప్ప పని చేసినా.. ఎవరో ఒకరు విమర్శిస్తారు’ ఈ రెండు సామెతలు మనకు తెలియనివి కావు. ప్రస్తుతం ఈ సామెతలు కల్కి మూవీకి సరిగ్గా సరిపోతాయి. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ హాలీవుడ్ రేంజ్ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. దాంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతూ.. దూసుకెళ్తున్నా యంగ్ రెబల్ స్టార్. అయితే కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ.. కొందరు ఈ చిత్రాన్ని విమర్శించారు. మరీ ముఖ్యంగా 3.01 గంటల  రన్ టైమ్ పై కొందరు పెదవి విరిచారు. ఇక ఈ విమర్శలకు తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చాడు.

కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతోంది. వరల్డ్ వైడ్ గా రికార్డులను తిరగరాస్తూ.. దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ చిత్రం విడుదలై, బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. కానీ విడుదలకు ముందు కల్కి రన్ టైమ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలన్నింటికీ.. సూపర్ సక్సెస్ తర్వాత సమాధానం ఇచ్చాడు. తాజాగా రన్ టైమ్ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..

“ఇలాంటి మూవీ కోసం నాకు ఇంకో నెల టైమ్ ఇచ్చినా సరిపోదు. ఇంకా టైమ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక కల్కి మూవీకి చిన్న చిన్న ప్రాంతాల్లో నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే.. మేం పడిన కష్టం అంతా మర్చిపోయాం. చాలా మంది రన్ టైమ్ పై విమర్శలు చేశారు. అయితే ఇది పార్ట్ 1 కాబట్టి.. అన్ని పాత్రలను ఇందులోనే పరిచయం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంత రన్ టైమ్ వచ్చింది. కానీ నేను విమర్శలను సైతం సానుకూలంగానే తీసుకుంటాను. ఎందుకంటే? అందులో కూడా మనకు తెలియని పాయింట్లు ఉంటాయి. ఇక కొంత మంది కల్కి మూవీని మహానటి సినిమాతో పోలుస్తున్నారు. ఈ రెండు విభిన్నమైన కథలు. వాటి మధ్య పోలికలు లేవు” అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి కల్కి రన్ టైమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి