P Krishna
సినీ ఇండస్ట్రీలో ఒక మూవీ సూపర్ హిట్ అయ్యిందీ అంటే దానికి ప్రధాన కారణం బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, హిట్ సాంగ్స్ అని అంటారు. సినిమా ఎంత బాగున్నా.. ఈ రెండు మిస్ అయ్యాయంటే ప్రేక్షకాధరణ పొందడం కష్టమే అంటారు.
సినీ ఇండస్ట్రీలో ఒక మూవీ సూపర్ హిట్ అయ్యిందీ అంటే దానికి ప్రధాన కారణం బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, హిట్ సాంగ్స్ అని అంటారు. సినిమా ఎంత బాగున్నా.. ఈ రెండు మిస్ అయ్యాయంటే ప్రేక్షకాధరణ పొందడం కష్టమే అంటారు.
P Krishna
ఒక సినిమా హిట్ కావాలంటే.. దర్శకుడు, నటీనటులు, నిర్మాణ విలువలు మాత్రమే కాదు.. మ్యూజిక్ కూడా ఎంతో అవసరం. ఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమాలో సరైన కథ లేకున్నా.. మ్యూజిక్ తో హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక సినిమాకు మ్యూజిక్ గుండెకాయ లాంటిది అని అంటారు. అందుకే స్టార్ హీరోల సినిమాల విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు మూవీ మేకర్స్. సినీ ఇండస్ట్రీ అంటే ఎంత టాలెంట్ ఉన్నా.. కూసింత అదృష్టం కూడా కలిసి రావాలని అంటారు. ఓ మ్యూజిక్ డైరెక్టర్ వరుస ఫ్లాపులు అందుకున్నారు.. ఇండస్ట్రీలో ఆయన రాణించడం కష్టం అనుకున్నారు.. గతంలో ఆయన టాలెంట్ దృష్టిలో ఉంచుకొని ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఉన్నవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో జీవీ ప్రకాశ్ ఒకరు. నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తా చాటిన జీవీ ప్రకాశ్ తన సంగీతంతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఒక సినిమా సక్సెస్ లో సంగీతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఒక సినిమా ఘనవిజయం సాధించింది అంటే.. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, హిట్ సాంగ్స్ కూడా ఒక భాగమే అంటారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కి మూవీ మేకర్స్ పిలిచి మరీ ఛాన్సులు ఇస్తుంటారు. ఇండస్ట్రీలో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు వరుస ఫాపులతో కనుమరుగైన విషయం తెలిసిందే. కానీ జీవీ ప్రకాశ్ విషయం లో అది వేరు అంటారు. వాస్తవానికి ఇటీవల ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. టైగర్ నాగేశ్వరరావు, జపాన్.. ఇటీవల రిలీజ్ అయిన ఆదికేశవ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పెద్దగా ఎలివేట్ చేయలోపోయారని టాక్ వినిపించింది.
ఇండస్ట్రీలో ఫ్లాప్ టాక్ వస్తున్నప్పటికీ.. జీవీ ప్రకాశ్ కుమార్ కి మాత్రం వరుస ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు తన మ్యూజిక్ తో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి లక్ బాగానే కలిసి వస్తుంది. తెలుగులో మట్కా మూవీకీ జీవీ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినీ ఇండస్ట్రలో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు. మనోడు తెలుగు ఇండస్ట్రీలో రాణించాలంటే.. సహ మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, దేవీ శ్రీ ప్రసాద్ లతో పాటు ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిరుధ్ లాంటి వారికి గట్టి పోటీ ఇవ్వాలి. అలాంటి అవకాశాన్ని జీవీ సద్వినియోగం చేసుకుంటే ముందు ముందు మంచి అవకాశాలు అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జీవీకి ఉన్న క్రేజ్ కి తెలుగులో మంచి మ్యూజికల్ హిట్ పడితే.. ఎలాంటి ఢోకా ఉండదని అభిమానులు అంటున్నారు. మరి అలాంటి ఓ మ్యూజిక్ హిట్ జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తారని కోరుకుందాం.