iDreamPost
android-app
ios-app

గుర్తు పట్టలేని విధంగా మారిన దేవీ శ్రీ ప్రసాద్

  • Published Mar 13, 2024 | 6:29 PM Updated Updated Mar 13, 2024 | 6:29 PM

దేవి, వర్షం మొదలు.. పుష్ప, వాల్తేరు వీరయ్య వరకు ఎంతో మంది హీరోల చిత్రాలకు మ్యూజిక్ అందించి.. సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. ఇటీవల నేషనల్ అవార్డు గెలుచుకున్న అతడు.. తాజాగా..

దేవి, వర్షం మొదలు.. పుష్ప, వాల్తేరు వీరయ్య వరకు ఎంతో మంది హీరోల చిత్రాలకు మ్యూజిక్ అందించి.. సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. ఇటీవల నేషనల్ అవార్డు గెలుచుకున్న అతడు.. తాజాగా..

  • Published Mar 13, 2024 | 6:29 PMUpdated Mar 13, 2024 | 6:29 PM
గుర్తు పట్టలేని విధంగా మారిన దేవీ శ్రీ ప్రసాద్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి చిత్రంతో మొదలైన ఆయన కెరీర్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా చేతినిండా సినిమాలతో బిజీయెస్ట్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు. కేవలం మ్యూజిక్ డైరెక్టరే కాదూ.. సింగర్, లిరిసిస్ట్, మంచి ఫెర్ఫ్మామర్ కూడా. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు బాణీ కట్టిన ఈ 44 ఏళ్ల కుర్రాడు.. స్టిల్ బ్యాచులర్. జాతీయ అవార్డుతో సహా అనేక అవార్డులు ఆయన పాదాక్రాంతం అయ్యాయి. స్టేజీ మీద పాడుతుంటే.. ఉర్రూతలూగిపోతుంటారు యూత్. ఎన్ని ఆల్బమ్స్ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయో. కొన్ని చిత్రాలను హిట్ ట్రాక్ ఎక్కించడంలో .. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా కీ రోల్ ప్లే చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మాటల రచయిత సత్యమూర్తి కొడుకు అయినప్పటికీ.. ఆయనకు గురువు మాత్రం మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా. ఎప్పుడు ఆయన గురువుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఇటీవల పుష్ప మూవీకి నేషనల్ అవార్డు రావడంతో.. ఆయన వద్దకు వెళ్లి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు. కాగా, తాజాగా మరోసారి తన గురువు గారిని కలిశాడు ఈ ర్యాపర్.  ఈ సారి ఆ గురువే ఆయన వద్దకు వచ్చాడు.  దేవి శ్రీ మ్యూజిక్ స్టూడియోను ఇళయరాజా సందర్శించారు. దీంతో తన ఇన్నాళ్ల కల నెరవేరిందని పొంగిపోయాడు దేవీ. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇళయరాజాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే .. ఆ ఫోటోల్లో దేవీని చూసి చాలా మంది నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. లుక్స్ చూసి ఆశ్చర్యపతున్నారు. చాలా సన్నగా, గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు ఈ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ స్టార్.

ఆ ఫోటోను చూసి ఏమైందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డైట్ ఏమన్నా చేస్తున్నాడా అన్న అనుమానం కలుగకమానదు. పూర్తిగా స్టైలిష్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో రెండు పాన్ ఇండియన్ చిత్రాలు. పుష్పతో నేషనల్ అవార్డును కొల్లగొట్టిన రాక్ స్టార్.. ఇప్పుడు పుష్ప 2.. అంతకు మించి మ్యూజిక్ అందించేందుకు పక్కా స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. మరో పాన్ ఇండియా చిత్రం కంగువా. తన సినిమాలకు మంచి సాంగ్స్ అందించిన దేవీకి మరో అవకాశం ఇచ్చాడు సూర్య. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేరకు కూడా అతడే మ్యూజిక్ డైరెక్టర్. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వస్తున్న తండేల్ సినిమాకు ఇతడే బాణీలు సమకూర్చుతున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి అతడే సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş