iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సంగీత దర్శకుడు మృతి

  • Published Sep 04, 2023 | 7:51 PM Updated Updated Sep 04, 2023 | 7:51 PM
ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సంగీత దర్శకుడు మృతి

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూస్తున్నారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలతో కొంతమంది చనిపోతే.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో కటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా దక్షిణాదికి చెందిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దశి అలియాస్ శివకుమార్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. స్నేహితులతో కలిసి కేరళ నుంచి చెన్నైకి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దశి అలియాస్ శివకుమార్ తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. సాలిగ్రామంకు చెందిన శివకుమార్ (50) తన స్నేహితులతో కలిసి తమిళ్ అదియాన్, అవడికి చెందిన నాగరాజ్, పుదుప్పేట్ కు చెందిన సినీ దర్శకుడు మూవెందన్ లతో కలిసి కేరళ నుంచి ఆదివారం చెన్నై కి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు తిరుపూర్ జిల్లా అవినాషి పట్టణానికి సమీపంలోకి రాగానే ప్రమదం జరిగింది. కారు ముందు టైర్ హఠాత్తుగా పేలిపోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ని బలంగా ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో శివ కుమార్ తో పాటు ఆయన స్నేహితుడు అదియాన్ అక్కడిక్కడే మృతి చెందారు. నాగరాజ్, మూవేందర్ తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అదియాన్, శివ కుమార్ మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు.

సంగీత దర్శకుడు శివ కుమార్ విషయానికి వస్తే.. పలు తమిళ, మలయాళ చిత్రాలకు సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మాలీవుడ్ మూవీ ‘దంధార’కు గాను ఆయనకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం లభించింది. తమిళంలో ఒత్తవీడు, అడవార్, సతనాయి పయనం చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎన్నోవేల ఆద్యాత్మిక పాటలు శివకుమార్ కంపోజ్ చేసి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. శివకుమార్ మరణ వార్త తెలిసి తమిల, మలయాళ ఇండస్ట్రీలో ఒక్కసారే ఉలిక్కిపడ్డాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గొప్ప సంగీత దర్శకుడు అకాల మరణం చెందడంతో సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.