iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది

ఈ ఫోటోలో చిన్న గౌను ధరించి.. చేతిలో బొమ్మను పట్టుకున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో చిన్న గౌను ధరించి.. చేతిలో బొమ్మను పట్టుకున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

ఈ చిన్నారి స్టార్ హీరోయిన్..  ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది

కొంత మంది నటీమణులు ఇలా తెలుగు తెరపై కనిపించి..అలా వెళ్లిపోతుంటారు. చేసినవీ కొన్ని చిత్రాలే అయినా.. మంచి మంచి క్యారెక్టర్స్, యాక్టింగ్, అందంతో మెస్మరైజ్ చేసి టాటా చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు ఒక్కసారి తమ మదిలో స్థానం కల్పిస్తే.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఆ నటీమణుల్ని ఆరాధిస్తూనే ఉంటారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఈ కోవకే వస్తుంది. ఈ పాప హీరోయిన్ అయ్యి… బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. ఈ రోజు ప్రత్యేకంగా ట్రెండ్ అవుతుంది. ఇంతకు ఆ నటి ఎవరంటే సనైటా.. సారీ సునీతా అలియాస్ సోనాలి బింద్రే. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన క్లాసిక్ మూవీ మురారి రీ రిలీజ్ అయ్యింది. థియేటర్లలో ఫ్యాన్స్ సినిమా చూసి నానా హంగామా సృష్టించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనాలి బింద్రే నటించిన సంగతి విదితమే. ది బెస్ట్ కపుల్‌గా రీల్ పెయిర్ అనిపించుకున్నారు. ఆగస్టు 9న మరోసారి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ జంటను మరోసారి తెరపై చూసుకుని మురిసిపోతున్నారు ఆడియన్స్. ఈ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. రీ రిలీజ్‌ను కూడా హిట్ చేశారు ఫ్యాన్స్. అలనాటి రామచంద్రుడు అన్నింటా సాటి పాట వచ్చినప్పుడు స్క్రీన్ పైకి అక్షింతలు చల్లడం విసిరి ఈ మూవీపై తమకున్న అభిమానాన్ని చాటారు. సినిమా రీ రిలీజ్ ముందు నుండే హంగామా, హడావుడి నెలకొన్న సంగతి విదితమే. ప్రీ బుక్సింగ్ సమయంలో కూడా రికార్డుల మోత మోగించింది మురారి మూవీ.

Sonali Bendre, Murari, Mahesh Babu, Krishna Vamsi 01

దీంతో ఇలా మరోసారి ట్రెండింగ్ అవుతుంది సోనాలి. 1994లో ఆగ్ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువతి.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటు తమిళంలో పలు సినిమాల్లో చేసిన అమ్మడు.. తెలుగులో రావడానికి కాస్త ఆలస్యం అయ్యింది. సుమారు కెరీర్ స్టార్ట్ చేసిన 16 ఏళ్లకు మురారి మూవీతో టాలీవుడ్ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఒక్క మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, పల్నాటి బ్రహ్మానాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాల్లో నటించింది.  శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఆమెను సనైటా అంటూ సరదాగా ఏడిపిస్తుంటారు చిరు. ఇప్పటి వరకు ఇదే ఆమె చివరి తెలుగు సినిమా. 2002లో ఫిల్మ్ మేకర్.. గోల్టీని వివాహం చేసుకుని మెల్లిగా తెరకు దూరమైంది. బుల్లితెరపై పలు ఛానల్లో జడ్జిగా వ్యవహరించింది. 2013లో కేవలం ఒక్క సినిమా చేసి.. స్మాల్ స్క్రీన్ పైనే కొనసాగింది. ఈ మధ్యలో క్యాన్సర్ బారిన పడి కోలుకుంది మన సునీత. హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆమె కూడా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తే చూడాలనుకుంటున్నారు.