iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు ఫ్యాన్సా మజాకానా..? రీ రిలీజ్‌లో కూడా రికార్డే

Murari Re Release: 2001లో సూపర్ స్టార్ మహేష్ బాబు-కృష్ణ వంశీ కాంబోలో వచ్చిన మూవీ మురారి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ రి రిలీజ్ కాబోతుంది. అయితే రీ రిలీజ్‌లో కూడా రికార్డులు సృష్టిస్తుంది.

Murari Re Release: 2001లో సూపర్ స్టార్ మహేష్ బాబు-కృష్ణ వంశీ కాంబోలో వచ్చిన మూవీ మురారి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ రి రిలీజ్ కాబోతుంది. అయితే రీ రిలీజ్‌లో కూడా రికార్డులు సృష్టిస్తుంది.

మహేష్ బాబు ఫ్యాన్సా మజాకానా..? రీ రిలీజ్‌లో కూడా రికార్డే

ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల ఓల్ట్ చిత్రాలను మళ్లీ ప్రేక్షకులకు ముందుకు తీసుకు వస్తున్నారు.  హీరో పుట్టిన రోజున లేదంటే ఏదైనా స్పెషల్ డే నాడు ఈ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే వీటిని టీవీల్లో చూసినప్పటికీ.. కాస్తంత హంగులు జోడించడంతో సరికొత్త ఎక్స్ పీరియన్స్ కోసం థియేటర్స్‌కు  వెళుతున్నారు.  అలాగే అప్పట్లో మిస్ అయ్యామనుకున్న వారంతా ఇప్పుడు మళ్లీ  రిలీజ్ అవుతుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నారు.  హీరోల బర్త్ డే కానుకగా సినిమాల రీరిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టెంది మహేశ్ అభిమానులే. గతేడాది పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారు.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ మూవీ మురారి రీ రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా  మురారితో పాటు ఒక్కడు చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా మరోసారి విడుదల చేయబోతున్నారు. 2001లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మురారితో పాటు ఒక్కడు చిత్రాలను 4K క్వాలిటీతో తీసుకు వస్తున్నారు. కాగా,  అందరి చూపు మురారిపై ఉంది. మురారి రీ రిలీజ్ కోసం వెడ్డింగ్ కార్డు ప్రిపేర్ చేయగా.. నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే.  అయితే ఈ మూవీ రీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తుంది.  ఇప్పటికే మురారి అడ్వాన్స్ బుకింగ్ సేల్ స్టార్ అయ్యింది.

Murari re release record

కాగా, నైజాంలోని హైదరాబాద్ నగరంలో అడ్వాన్స్ సేల్స్‌లో  ఫాస్టెస్ట్ రూ. 50 లక్షలు కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. సుదర్శన్ థియేటర్‌లో అయితే  ఆగస్టు 9న ఒక్క టికెట్ కూడా మిగల్లేదట.  మరో వైపు బుక్ మై షోలో గడిచిన 24 గంటలో 40.01 వేల టికెట్స్ తెగి  రికార్డులు సృష్టిస్తోంది. ఇంతకు మునుపు బిజినెస్ మాన్ పేరిట ఉన్న రికార్డు ( 38.2K) రికార్డుని తిరగరాసింది మురారి.  ఈ రికార్డులు చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్సా మజాకానా అనిపించకమానదు.  ఇక మహేష్ బాబు పుట్టిన రోజున భారీగానే ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. రక్త దానాాలు, అన్నదానాలు చేపట్టనున్నారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి నుండి సర్ ఫ్రైజ్ వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నారు.