‘అతడు’ టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ కల్ట్ క్లాసిక్. ఇక మహేశ్ బాబు కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో అతడు కచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటుడు మురళీ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో కమర్షియల్ గా ఆడకపోయినా.. ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ అనే చెబుతారు. పార్దు పాత్రలో మహేశ్ ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిందనే చెప్పాలి. మరి ఇలాంటి సినిమాలో తొలుత హీరోగా మహేశ్ బాబును అనుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా మూవీ నిర్మాతల్లో ఒకరైన మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘అతడు’. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చాలా మంది వదిలిపెట్టకుండా చూస్తారు. ఇక ఈ మూవీలో త్రివిక్రమ్ పంచు డైలాగ్స్ ఇప్పటికీ ఓ రేంజ్ లో పేలుతుంటాయి. మహేష్ బాబు పార్దు, నందు పాత్రల్లో ఒదిగిపోయిన తీరు అద్బుతమనే చెప్పాలి. అతడు సినిమాకు సంబంధించిన కథ, కథనం, మాటలు, పాటలు సూపర్ హిట్ అయినప్పటికీ.. థియేటర్లలో మాత్రం ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమై విషయాన్ని పంచుకున్నారు నిర్మాతల్లో ఒకరైన మురళీ మోహన్. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”ఉదయ్ కిరణ్ ను మెుదటి సినిమాలో చూసి చాలా బాగున్నాడు మంచి అబ్బాయి అనుకున్నాను. ఫస్ట్ సినిమా బాగుండటంతో.. ఫోన్ చేసి అభినందించాను. సర్ మీరు నాకు ఫోన్ చేశారా? అని సంతోషపడ్డాడు ఉదయ్ కిరణ్. మీ ఇంటికొచ్చి కలుస్తాను అన్నాడు. అన్నట్లుగానే వచ్చి కలిశాడు. అలా తరచుగా మా ఇంటికి వచ్చి కలిసేవాడు. ఈ క్రమంలోనే నేను అతడు సినిమా గురించి చెప్పాను.
మెుదట అతడు మూవీ ఉదయ్ కిరణ్ తోనే చేద్దామనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్స్ సర్దుబాటుకాక కుదరలేదు. వెంటనే అనుకోకుండా కథ మహేశ్ బాబు దగ్గరికి వెళ్లింది” అని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కాగా.. అతడు మూవీ విడుదలైన 2005లోనే ఉదయ్ కిరణ్ ‘ఔనన్నా కాదన్నా’ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసమే అతడు మూవీని వదులుకొని ఉంటాడని మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మురళీ మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అతడు సినిమా లో మొదట హీరో గా ఉదయ్ కిరణ్ ను అనుకున్నాం – అతడు ప్రొడ్యూసర్ మురళి మోహన్ గారు. pic.twitter.com/3vXHCbYFWq
— Hanu (@HanuNews) October 6, 2023