iDreamPost
android-app
ios-app

‘కల్కి 2898 ఏడీ’.. ఊహించని పాత్రల్లో సీతారామం జోడీ! సినిమాకే ప్రత్యేకమట..

  • Published Jun 24, 2024 | 3:26 PM Updated Updated Jun 24, 2024 | 3:26 PM

కల్కి చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో ఊహించని పాత్రల్లో సీతారామం జోడీ కనిపించబోతున్నట్లు వినికిడి. ఆ వివరాల్లోకి వెళితే..

కల్కి చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో ఊహించని పాత్రల్లో సీతారామం జోడీ కనిపించబోతున్నట్లు వినికిడి. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 24, 2024 | 3:26 PMUpdated Jun 24, 2024 | 3:26 PM
‘కల్కి 2898 ఏడీ’.. ఊహించని పాత్రల్లో సీతారామం జోడీ! సినిమాకే ప్రత్యేకమట..

‘కల్కి 2898 ఏడీ’ చిత్రం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. సగటు సినీ అభిమానులతో పాటుగా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల అయిన రెండు ట్రైలర్లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లు ఉందని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇక ఇందులో ఎంతో మంది స్టార్లు నటిస్తున్నారు. అయితే కొందరి పేర్లు రివీల్ చేయగా.. మరికొందరిని దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. కల్కిలో ఊహించని పాత్రల్లో సీతారామం జోడీ కనిపించబోతున్నట్లు వినికిడి. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్, అమితాబ్, కమల్, దుల్కర్ సల్మాన్, దీపికా, మాళవికా నాయర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో కల్కి మూవీ తెరకెక్కిన విషయం తెసిందే. అయితే వీరితో పాటుగా మరికొంతమంది స్టార్స్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ గా మారిన సంగతి విదితమే. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నాని, విజయ్ దేవరకొండ లాంటి బిగ్ స్టార్స్ సైతం ఈ చిత్రంలో క్యామియో రోల్స్ లో మెరిసినట్లు తెలుస్తోంది. అయితే వీరికి సంబంధించిన ఈ చిన్న క్లూను కూడా మేకర్స్ విడుదల చేయలేదు. దాంతో మూవీపై మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా కల్కి మూవీలో ఓ జోడీ గురించి నెట్టింట వార్త వైరల్ గా మారింది. అదేంటంటే?

Seetharamam in Kalki

కల్కి తల్లిదండ్రులుగా సీతారామం జోడీ దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారట. విష్ణుయశస్-సుమతి పాత్రల్లో వీరు కనిపించి మెస్మరైజ్ చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ప్రభాసే కల్కి అయితే.. ఈ ఎపిసోడ్ మూవీకే హైలెట్ గా మారుతుందట. దాంతో మరోసారి తమ అభిమాన జోడీని తెరపై చూడబోతున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నా అభిమానులు. అయితే దీపికా, మాళవిక నాయర్ లను కూడా గర్భంతో ఉన్నట్లు చూపించారు. దాంతో కల్కి ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నాయని, వాటిని థియేటర్లలో చూస్తే.. ప్రేక్షకులకు మైండ్ పోవడం ఖాయమని సెన్సార్ సభ్యులు చెప్పిన విషయం తెలియనిది కాదు. కాగా.. ఇప్పటికే సీతారామం మూవీతో అభిమానులు హృదయాలు కొల్లగొట్టిన ఈ జోడీ.. కల్కి మూవీలో ఏ రేంజ్ లో యాక్ట్ చేసిందో చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. మరి దుల్కర్-మృణాల్ జోడీని మరోసారి తెరపై చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişaresbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom