iDreamPost
android-app
ios-app

మళ్లీ తెలుగు ఫ్యాన్స్ ని ఫిదా చేసిన మృణాల్! వైరల్ అవుతున్న వీడియో!

  • Author ajaykrishna Updated - 01:26 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Updated - 01:26 PM, Tue - 12 September 23
మళ్లీ తెలుగు ఫ్యాన్స్ ని ఫిదా చేసిన మృణాల్! వైరల్ అవుతున్న వీడియో!

బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగులో క్రేజ్ సొంతం చేసుకోవడం కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో వేరే భాషలకు చెందిన భామలే స్టార్డమ్ అందుకుంటున్నారు.. టాలీవుడ్ స్టార్స్ సరసన సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో క్రేజ్ సంపాదించుకొని.. స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతోంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. గతేడాది సీతారామం సినిమాతో తెలుగు డెబ్యూ చేసిన మృణాల్.. ఆ ఒక్క సినిమాతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ సినిమాలో సీత క్యారెక్టర్ కి గాను.. మృణాల్ కి గుండెల్లో గుడి కట్టేశారు తెలుగు కుర్రాళ్ళు.

అందమైన నటనతో పాటు అంతే అందమైన స్మైల్ తో అందరి మదిని కుదిపేసింది. నిజంగా సీతారామం సినిమాలో.. ‘ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైనే చేరుకున్నదా?’ అనే సాంగ్ రియల్ లైఫ్ లో కూడా మృణాల్ కి సూట్ అవుతుంది. ఎందుకంటే.. బాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుందనే విషయం పక్కన పెడితే.. తెలుగులో మాత్రం పక్కాగా ఇక్కడి కల్చర్ ని, ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా రెడీ అవుతోందట. సీతారామం తర్వాత మృణాల్ ని వరుస ఆఫర్స్ పలకరించాయి. అయినప్పటికీ.. వాటిలో సెలెక్టెడ్ గా వెళ్తోంది. ప్రస్తుతం నానితో హాయ్ నాన్న మూవీ చేస్తూనే.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఓకే చేసింది.

ఇవి రెండు కాకుండా కొత్తగా మృణాల్ కి రెండు సీనియర్ హీరోల సినిమాల కోసం చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందులో ఒకటి కింగ్ నాగార్జున నటిస్తున్న నా సామిరంగా.. రెండోది మెగాస్టార్ 157లో నటించనుందని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమాలలో ఉందా లేదా అనేది అధికారిక ప్రకటన వస్తే తెలిసిపోతుంది. ఇవేవి కాకుండా మృణాల్ ఓ కొత్త పనికి పూనుకుంది. అదేంటంటే.. తెలుగులో ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తుండటంతో.. భాష నేర్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో తెలుగు క్లాసులు కూడా వింటోంది. తాను తెలుగు క్లాసులు వింటూ.. భాష నేర్చుకుంటున్నట్లు తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో చూసి.. మృణాల్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. మరి మృణాల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş