iDreamPost
android-app
ios-app

వయసుపై నాని ప్రశ్న.. అసలు వయసెంతో చెప్పిన మృణాల్‌!

తాజాగా, హాయ్‌ నాన్న సినిమా ప్రమోషన్‌కు సంబంధించి మృణాల్‌, నానిల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మృణాల్‌, నానిల మధ్య ఓ ఫన్నీ సన్నీవేశం జరిగింది.

తాజాగా, హాయ్‌ నాన్న సినిమా ప్రమోషన్‌కు సంబంధించి మృణాల్‌, నానిల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మృణాల్‌, నానిల మధ్య ఓ ఫన్నీ సన్నీవేశం జరిగింది.

వయసుపై నాని ప్రశ్న.. అసలు వయసెంతో చెప్పిన మృణాల్‌!

బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు. ఆమె నటించిన రెండు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయ్‌ దేవర కొండతో ఆమె కలిసి నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌’.. నానితో కలిసి నటించిన ‘ హాయ్‌ నాన్న’ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ హాయ్‌ నాన్న’ సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. మృణాల్‌, నాని వీలైనంత ఎక్కువగా సినిమా ప్రమోషన్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా తరచుగా ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నారు.

తాజాగా, హాయ్‌ నాన్న సినిమా ప్రమోషన్‌కు సంబంధించి మృణాల్‌, నానిల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మృణాల్‌, నానిల మధ్య ఓ ఫన్నీ సన్నివేశం జరిగింది. నాని.. మృణాల్‌ వయసుపై వేసిన ప్రశ్నకు ఆమె ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఆ వీడియో ఏముందంటే.. నాని.. మృణాల్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా .. ‘‘ ఇది నీకు ఎంతో ఇష్టమైన ప్రశ్న.. నీ వయసెంత?’’ అని ప్రశ్నించారు నాని.. ఇందుకు మృణాల్‌ సమాధానం ఇస్తూ..

‘‘ పోయిన నెలే 16 ఏళ్లు దాటాయి.. ’’ అని నవ్వుతూ అన్నారు. దానికి నాని ‘‘ నమ్మేశామ్‌’’ అని అంటూ నవ్వారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు కూడా మృణాల్‌ సమాధానంపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ‘ హాయ్‌ నాన్న!’ ప్యాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సౌర్యవ్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 7న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరి, వయసుపై మృణాల్‌ ఫన్నీ సమాధానం ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis