iDreamPost
android-app
ios-app

సుమ షోలో కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్.. అందరూ అలా అంటున్నారంటూ!

  • Published Jul 31, 2023 | 8:13 PM Updated Updated Jul 31, 2023 | 8:13 PM
  • Published Jul 31, 2023 | 8:13 PMUpdated Jul 31, 2023 | 8:13 PM
సుమ షోలో కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్.. అందరూ అలా అంటున్నారంటూ!

సోహైల్.. ఈ పేరు వినగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో జోష్ రెట్టింపు అవుతుంది. కెరీర్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సోహైల్ కు బిగ్ బాస్ రూపంలో చాలా మంచి అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే సోహైల్ హీరోగా ఆర్గానిక్ మామా.. హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో సోహైల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో సోహైల్ నటించిన విషయం తెలిసిందే.

సోహైల్ లీడ్ రోల్ ప్లే చేసిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. చాలా భిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. సోహైల్ కూడా ఈ సినిమాతో హీరోగా స్థిర పడిపోతాడని చెబుతున్నారు. ఈ మూవీ ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం ఇప్పటికే ప్రమోష్స్ కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే మిస్టర్ ప్రెగ్నెంట్ టీమ్ సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. ఈ షోలో వాళ్లు చాలానే అల్లరి చేశారు. అంతేకాకుండా సోహైల్ తనదైన ఎనర్జీతో ఇరగదీశాడు. హీరోయిన్ రూపా కొడువయూర్ కూడా క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టింది. వీళ్ల ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో వీళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంతా బాగానే ఉన్నా.. చివర్లో మాత్రం సోహైల్ ని ఏడిపించేశారు.

తన కెరీర్ కి సంబంధించి మాట్లాడుతూ సోహైల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే కంగారు తనలో ఉండేదని చెప్పుకొచ్చాడు. “లైఫ్ లో ఎలా ముందుకెళ్లాలి.. ఏంది? యాక్సెప్ట్ చేస్తారా లేదా? రియాలిటీ షో నుంచి వచ్చాడు. చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు అని భయం వేస్తూ ఉండేది. నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేసిన తర్వాత.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఏందిరా వీడు తేడాగాడా అదీ ఇదీ అన్నట్లుగా మాట్లాడారు” అంటూ సోహైల్ ఏడ్చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ప్రోమోకి నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సోహైల్ కి అంతా సోపోర్ట్ గా నిలుస్తున్నారు. అలాంటి మాటలు పట్టించుకోకు నీకు తోడుగా మేము ఉన్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అంటూ భరోసానిస్తున్నారు. ఈ సినిమాతో తన కెరీర్ కూడా సెట్ అవుతుంది.. ఆల్ ది బెస్ట్ అంటూ సోహైల్ ఫ్యాన్స్ అంతా కామెంట్ చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio