ఆగష్టు 15 రిలీజైన 4 సినిమాలు.. డే 2 కలెక్షన్స్‌లో ఏ సినిమా ఎంత కలెక్ట్‌ చేసిందంటే

August 15 2024 Movie Releases Day2 Collections: ఈసారి ఆగస్టు 15 న థియేటర్స్ లో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ నాలుగు సినిమాల టాక్ ఎలా ఉందో చూసే ఉంటారు. మరి ఈ నాలుగు సినిమాల డే 2 కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం.

August 15 2024 Movie Releases Day2 Collections: ఈసారి ఆగస్టు 15 న థియేటర్స్ లో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ నాలుగు సినిమాల టాక్ ఎలా ఉందో చూసే ఉంటారు. మరి ఈ నాలుగు సినిమాల డే 2 కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం.

ఇండిపెండెన్స్ డే సందర్బంగా థియేటర్ లో.. రిలీజైన నాలుగు సినిమాలలలో.. రిలీజ్ కు ముందు శంకర్, రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. అలాగే రామ్ పోతినేని , పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాపై కూడా డీసెంట్ హైప్ కొనసాగింది.ఇక తారక్ బావమరిది నార్నె నితిన్ ఆయ్ సినిమా గురించి అసలు ఏ బజ్ లేదు. ఈ మూడు తెలుగు సినిమాలతో పాటు.. విక్రమ్ తంగలాన్ పై కూడా పాజిటివ్ బజ్ నెలకొంది . కానీ రిలీజ్ తర్వాత మాత్రం అందరి అంచనాలు తారుమారయ్యాయి. మొదటి రోజు కలెక్షన్స్ లో రామ్ డబుల్‌ ఇస్మార్ట్‌.. వరల్డ్‌ వైడ్‌గా 15 కోట్ల రూపాయలు సాధించి ముందంజలో నిలిచింది. అలాగే ఆయ్ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మరి రెండవ రోజు ఈ నాలుగు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో.. ఏ సినిమా ముందంజలో ఉందో చూసేద్దాం.

డబుల్ ఇస్మార్ట్:

పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు.. సిక్వెల్ గా వచ్చిన సినిమానే డబుల్ ఇస్మార్ట్. ఆ సమయంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి హిట్ సాధించింది.. దీనితో డబుల్ ఇస్మార్ట్ పై కూడా అదే అంచనాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ అయితే రాలేదు కానీ.. పర్లేదు అనిపించుకుని.. రిలీజ్ అయినా నాలుగు సినిమాలలో.. మొదటి రోజు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ముందంజలో నిలిచింది.

ఇక డబుల్ ఇస్మార్ట్ రెండవ రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. రెండో రోజు కూడా ఇదే ఊపు కొనసాగుతుందని అనుకున్నారు కానీ.. ఊహించని రేంజ్ లో వసూళ్లు పడిపోయాయి. మొత్తం మీద రెండో రోజు ఆంధ్రాలో రూ. 1.75 కోట్లు, తమిళ, కన్నడ, ఇతర ఏరియాల్లో రూ. 50 లక్షలు… అలాగే అటు ఓవర్సీస్ కలెక్షన్స్ ను కలుపుకొని పంచ వ్యాప్తంగా రెండో రోజు డబుల్ ఇస్మార్ట్ రూ. 16 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

మిస్టర్ బచ్చన్:

హరీష్ శంకర్ , రవి తేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందు వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై.. అంచనాలను పెంచేలా చేసింది. కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దానితో మొదటి రోజు మిస్టర్ బచ్చన్ మూవీ వరల్డ్ వైడ్ గా.. రూ. 4.8 నుంచి 5 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఇదిలా ఉంటే రెండో రోజు కలెక్షన్స్ ఇంకా దారుణంగా పడిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.30 కోట్లు రాబట్టగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 1.75 కోట్లు మాత్రమే వసూళ్లు చేయగలిగింది. ఇలా రెండు రోజులుగా మొత్తం రూ. 8 కోట్లు షేర్ కలెక్ట్ చేసుకుంది. ఇదే కనుక కొనసాగితే మిస్టర్ బచ్చన్ మూవీ బ్రేక్ ఈవెన్ ను దాటడం కష్టమే అని భావిస్తున్నారు సినీ పండితులు. మరి లాంగ్ రన్ ఏ మేరకు కలెక్షన్స్ ను సాధిస్తుందో చూడాలి.

ఆయ్:

తారక్ బావమరిదిగా అందరికి పరిచయం అవుతున్న నితిన్ నార్నె.. ఎక్కడ కూడా ఆ ఇమేజ్ వాడుకోకుండా.. మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయ్ నితిన్ కు రెండో సినిమా అయ్యి ఉండి.. పెద్ద సినిమాల మధ్యన రిలీజ్ చేయడంలో సాహసం చేసిన నితిన్ కు.. తగిన ఫలితమే దక్కింది. ఎటువంటి అంచనాలు , బజ్ లేకుండా రిలీజ్ అయినా ఈ సినిమా.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అలాగే మొదటి రోజు ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు కలెక్షన్స్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 65 లక్షలు, వరల్డ్ వైడ్ గా రూ. 75 లక్షలు రాబట్టింది.

తంగలాన్:

తెలుగు సినిమాలకు పోటీగా.. సరిగ్గా ఇదే సమయంలో రిలీజ్ అయినా చియాన్ విక్రమ్.. తమిళ మూవీ తంగలాన్ కు.. మిక్స్డ్ టాక్ వస్తుంది. తెలుగు కంటే కూడా తమిళంలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది. తమిళనాడులో మొదటి రోజు ఈ మూవీ రూ. 15 కోట్లు రాబట్టగా.. తెలుగులో 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి.. ఇలా వరల్డ్ వైడ్ గా రూ. 26 కోట్లను కలెక్ట్‌ చేసింది.ఇక రెండో రోజు ఈ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే.. తమిళంలో రూ. 3.5 కోట్లు, తెలుగులో రూ. కోటి.. మొత్తంగా రెండో రోజు వరల్డ్ వైడ్ గా రూ. 7.5 కోట్లను కలెక్ట్ చేసి.. రెండు రోజుల్లో మొత్తం మీద రూ. 34 కోట్లను సాధించింది.

మిస్టర్ బచ్చన్ , డబుల్ ఇస్మార్ట్ సినిమాల రెండో రోజు కలెక్షన్స్ నిరాశ పరచగా.. ఎటువంటి బజ్ లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయినా ఆయ్ మూవీ.. రెండో రోజు కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాల డే 2 కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments