iDreamPost
android-app
ios-app

గిల్లడం, గిల్లించుకోవడం, జోల పాడటం.. అన్నీ తెలిసిన దర్శకుడు హరీశ్!

Mr Bachchan Director Harish Shankar Special Talent: టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో హరీశ్ శంకర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఆయనలో ఇలాంటి ఒక యునిక్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తో ఆయన ఏం చేశాడు.. ఏం చేయగలడో చూడండి.

Mr Bachchan Director Harish Shankar Special Talent: టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో హరీశ్ శంకర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఆయనలో ఇలాంటి ఒక యునిక్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తో ఆయన ఏం చేశాడు.. ఏం చేయగలడో చూడండి.

గిల్లడం, గిల్లించుకోవడం, జోల పాడటం.. అన్నీ తెలిసిన దర్శకుడు హరీశ్!

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో దర్శకుడు హరీశ్ శంకర్ మాత్రం చాలా ప్రత్యేకం. సినిమాలు, సక్సెస్ లు, పరాజయాలు ఇవన్నీ ఆయనకి కొత్త కాదు. ఇండస్ట్రీలో నలిగిపోయి, పాతుకుపోయిన వ్యక్తి. సో.. మనం ఆ యాంగిల్ జోలికి పోవడం లేదు. ఇప్పుడు చర్చ అంతా హరీశ్ లౌక్యం గురించి. హరీశ్ శంకర్ లో కావాల్సినంత ఎటకారం, అంతకు మించిన స్పాంటినిటి, వీటన్నిటికీ మించిన హ్యూమర్ ఉంది. ఇప్పుడు ఈ లక్షణాలే అతన్ని స్పెషల్ గా మార్చేశాయి. ఓ ప్రెస్ మీట్ జరిగితే సినిమా జర్నలిస్ట్ లు హైలెట్ అవ్వడం మామూలు విషయం. కానీ.., మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ మీట్ తో హరీశ్ హైలెట్ అయ్యాడు. తనని ప్రశ్నలు అడిగిన, అడగని జర్నలిస్ట్ లని కూడా గిల్లేశాడు. అలా అని ఎక్కడైనా హద్దు మీరాడా అంటే అదీ లేదు. లాజిక్ తో కొట్టాడు. నిజమే కదా అనిపించే ప్రశ్నలు అవి. నిజానికి సినిమా జర్నలిస్టుల జోలికి పెద్దగా ఏ స్టార్ పోడు. కోరి.. కొరివితో తల గోక్కోవడం దేనికి అంటారు. అయితే.. హరీశ్ మాత్రం ఆ లెక్కలన్నీ బ్రేక్ చేసేశాడు. ఇప్పుడు సినిమా జర్నలిస్టులు అందరికీ హరీశ్ ఆప్తుడు. అయిన వాడు. అందరివాడు. అందరిని గిల్లి, సింపుల్ గా జోలపాట పాడినవాడు.

నిజానికి ఓ సీనియర్ జర్నలిస్ట్ తన సినిమా లెక్కలు.. ట్విట్టర్ లో పెడుతున్నాడు అనే దగ్గర ట్రిగరింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఓ వారం పాటు ఇద్దరి మధ్య కోల్డ్ వార్.. హాట్ గా జరిగింది. సంభాషణ వ్యక్తిగతం వరకు వెళ్లిపోయింది. నిర్మాత ఎంట్రీ ఇచ్చాడు. సయోధ్య చేశాడు. కట్ చేస్తే.. ఆ సదురు జర్నలిస్ట్ కే హరీశ్ శంకర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేశాడు. ముందుగా గిల్లించుకున్నాడు. తరువాత తాను గట్టిగా గిల్లాడు. చివరిలో ఇంటర్వ్యూ పేరుతో కమ్మని జోల పాట పడేశాడు. ఇప్పుడు సదురు జర్నలిస్ట్ హ్యాపీ. మిస్టర్ బచ్చన్ టీమ్ హ్యాపీ. హరీశ్ డబల్ హ్యాపీ. తాను ఎక్కడా తగ్గలేదు. ఎవ్వరినీ తగ్గించలేదు. కథని అలా నడిపించాడు మరి. సో.. ఇక్కడ మిగతా ఇండస్ట్రీ అంతా అనుకున్నట్టు హరీశ్ శంకర్ ది తిక్క కాదు.. అన్నీ ఎమోషన్స్ కొలతలతో సహా తెలిసిన ఓ పర్ఫెక్ట్ లెక్క.

ఇక బచ్చన్ ప్రెస్ మీట్ విషయానికి వద్దాం. రెడ్ బుల్ తాగొచ్చాడు హరీశ్.. అంత ఎనర్జీతో కనిపించాడు. ( నిజానికి ఈ మిరపకాయ్ ఎప్పుడూ అంతే ఘాటుగా ఉంటుంది). అడిగిన ప్రశ్నకి, అడగని ప్రశ్నకి సమాధానం ఇస్తూ పోయాడు. పవన్ తో సినిమా ఉంటుందా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు అని క్వశ్చన్ చేస్తే.. నేను ఫ్యాన్స్ తో మాట్లాడుకుంటాలే అని సమాధానం! జర్నలిస్ట్ లకి రుచించని సమాధానం ఇది. ఫ్యాన్స్ కి, స్టార్స్ కి మేమే కదా బ్రిడ్జ్ అనుకుంటారు సినీ జర్నలిస్టులు. కొంతకాలం క్రితం వరకు అది నిజం కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇన్ స్టాలో లైవ్ లోకి వస్తే.. ఎవరితో అయినా డైరెక్ట్ గా మాట్లాడేయొచ్చు. హరీశ్ ఆన్సర్ కి అర్థం కూడా ఇదే కావచ్చు. అయినా కూడా కాస్త డేరింగ్ ఆన్సర్ అనిపించింది.

సరేలే అనుకునేలోపు.. సినీ జర్నలిస్టుల నుండి ప్రశ్నల వేగం ఎక్కువ అయ్యింది. వయసులో పెద్దాయన్ని గుంటనక్క అని ఎలా అంటావు? జర్నలిస్టులపై ఈ మాటలు ఏంటి అంటూ వేగం ఎక్కువ అయింది. హరీశ్ దొరికేశాడు అనిపించింది. కానీ.., మాటలు రాసినోడు, మాటలు నేర్చినోడు కదా మన గబ్బర్ సింగ్. వెంటనే సుమ స్నాక్స్ ఎపిసోడ్ తెరపైకి తెచ్చాడు. సుమ చేత సారీ చెప్పించారు కదా? హీరోయిన్ పుట్టుమచ్చల లెక్క అడిగిన మీ జర్నలిస్టు సారీ చెప్పడా? మీకు క్షమాపణ చెప్పించే బాధ్యత లేదా అని లాజిక్ తీశాడు.

హరీశ్.. ఆ ప్రశ్న అడగడం వెనుక అసలు రీజన్ వేరే. మన ఎమోషన్స్ తో ఆడుకునప్పుడు ఓ వ్యక్తిని ఓ మాట అంటాము. అది.. ఆ వ్యక్తికి పరిమితం. అంతేగాని అతని వృత్తికి ఆపాదించకండి. అలా ఆపాదిస్తారా? మరి.. సినీ జర్నలిస్టులు తప్పులు ఎత్తి చూపడమే కాదు, మీలో ఒకరు ఆ తప్పు చేసినప్పుడు.. వారి చేత కూడా క్షమాపణలు చెప్పాలి కదా అన్నది హరీశ్ లాజిక్. మీడియా మిత్రులు అందరూ విజ్ఞులు. అందరికీ గబ్బర్ సింగ్ అంతరంగం అర్థం అయ్యింది. ఆ చర్చ చాలా కూల్ గా ముగిసిపోయింది. ఇక్కడ కూడా హరీశ్ లౌక్యమే పని చేసింది. ఇప్పుడు హరీశ్ ఎవ్వరికీ విరోధి కాదు. అలా అని తాను గెలికి వదిలేసిన అందరికీ పూర్తిగా టార్గెట్ కాకుండా పోడు. రేపు మిస్టర్ బచ్చన్ బాగుంటే.. ఇక్కడ అందరికీ అందరూ అయినోళ్లు అయిపోతారు. ఆల్ ది బెస్ట్ టూ హరీశ్ శంకర్.