iDreamPost
android-app
ios-app

దర్శకుడు హరీష్ శంకర్ యాక్టర్‌గా కనిపించిన ఈ సినిమా ఏదో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న యాక్టర్ .. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. తాజాగా ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కాక ముందు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ.. నటుడిగానూ ఆకట్టుకున్నాడు. ఇంతకు అతడు నటించిన ఈ పిక్చర్ ఏ సినిమాలోనిదో తెలుసా..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న యాక్టర్ .. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. తాజాగా ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కాక ముందు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ.. నటుడిగానూ ఆకట్టుకున్నాడు. ఇంతకు అతడు నటించిన ఈ పిక్చర్ ఏ సినిమాలోనిదో తెలుసా..?

దర్శకుడు హరీష్ శంకర్ యాక్టర్‌గా కనిపించిన ఈ సినిమా ఏదో గుర్తుపట్టారా?

డైరెక్టర్లు యాక్టర్లు కావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఎప్పటి నుండో కొనసాగుతుంది. మెగా ఫోన్ వెనుక నటీనటులకు యాక్షన్, కట్ చెప్పడమే కాదు.. అప్పుడప్పుడు బరిలోకి దిగి తాము నటించగలమని నిరూపిస్తుంటారు. అయితే దర్శకుడు కాక ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌, అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నప్పుడు తెరపై చిన్న క్యారెక్టర్లలో మెరుస్తుంటారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న నటుడ్ని గుర్తు పట్టారా..? స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఇటీవల మాస్ మహారాజా రవితేజ- భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా మిస్టర్ బచ్చన్ అనే మూవీని తెరకెక్కించాడు హరీష్ శంకర్. ఆగస్టు 15న ప్రేక్షకులను పలకరించి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. హరీష్ శంకర్ చాలా మందికి దర్శకుడిగానే తెలుసు. ఆయనలో చాలా మంచి నటుడున్నాడని తెలియదు.

హరీష్ శంకర్ ఓ మూవీలో రెండు మూడు సీన్లు చేశాడని తెలుసా. అదే తరుణ్, అనిత, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా వచ్చిన నిన్నే ఇష్టపడ్డాను. 2003లో వచ్చిన ఈ చిత్రానికి కొండ దర్శకుడిగా వ్యవహరించగా.. హరీష్ అసోసియేట్ దర్శకుడిగా వర్క్ చేశాడు. ఈ సినిమాలో కొన్ని సీన్లలో కనిపిస్తాడు ఈ స్టార్ డైరెక్టర్. ట్రైన్లలో వచ్చే రెండు సీన్లలో అప్పీరియన్స్ ఇచ్చాడు. ఇందులో హరీష్ శంకర్ దగ్గర అప్పు చేస్తాడు అలీ. అప్పు తీర్చకుండా తిరుగుతుంటే.. పట్టుకుని.. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావంటూ ప్రశ్నిస్తాడు. మరోసారి అనిత.. అతడ్ని చిరంజీవి అరకు షూటింగ్ వచ్చాడంటూ చెప్పడంతో.. చిరంజీవా అంటూ ఎగురుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఇదే కాదు అందరివాడు, ఏ ఫిల్మ్ బై అరవింద్, మొదటి సినిమా, నేనింతే, సమ్మోహనం చిత్రాల్లో కూడా క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చాడు. నటుడిగా యాక్ట్ చేస్తూనే.. అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు.

Harish shanker in ninne istapaddanu movie

నిన్నే ఇష్టపడ్డాను, వీడే, మొదటి సినిమాలకు కూడా అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. వీడే మూవీ పరిచయంతో రవితేజ డైరెక్టర్‌గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఇద్దరికి కోలుకోలేని దెబ్బ తీసింది. అయినప్పటికీ మరో ఛాన్స్ ఇచ్చాడు రవి. రవితేజతో మిరప కాయ్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు హరీష్. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో రామయ్య వస్తావయ్యా, సాయి తేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్, అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం, వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ చిత్రాలు తెరకెక్కించాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాతో పలకరించాడు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉంది. ఎక్కువగా మెగా ఫ్యామిలీతో సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అయ్యాడు.