కంగనా రౌనత్‌కి ఎన్నికపై హై కోర్టులో పిటీషన్..!

Kangana Ranaut Issue: సినీ ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.. అలాంటి వారిలో కంగనా రౌనత్ ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే కంగనా రౌనత్ ఎదో ఒక కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. ప్రస్తుతం కంగనా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి.

Kangana Ranaut Issue: సినీ ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.. అలాంటి వారిలో కంగనా రౌనత్ ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే కంగనా రౌనత్ ఎదో ఒక కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. ప్రస్తుతం కంగనా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి.

సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఎంపీ, నటి కంగనా రౌనత్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.పార్లమెంట్ సమావేశాలకు హాజరై సామాజిక, రాజకీయ సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు. తాజాగా కంగనా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎన్నికను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. ఈ క్రమంలోనే కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేస్తూ..  ఆగస్టు 21లోగా కంగనా నుంచి సమాధానం కోరారు. కాగా, కిన్నెర్ నివాసి అయిన లాయక్ రామ్ నేగి ఈ పిటీషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ క్విన్ కంగనా రౌనత్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు. అయితే కంగనా రౌనత్ ఎన్నికపై హిమాచల్ ప్రదేశ్ కోర్టులో స్వతంత్ర అభ్యర్థి లాయక్ రామ్ నేగి అనే వ్యక్తి పిటీషన్ వేశారు. మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు రనౌత్‌ను ఆదేశించింది. కిన్నౌర్ నివాసి, అటవీ శాఖ మాజీ ఉద్యోగి అయిన లాయక్ రామ్ నేగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పూర్తి చేసినప్పటికీ ఆయన నామినేషన్ తిరస్కరించబడింది. దీనిపై సవాల్ చేస్తూ పదవీ విరమణ తర్వాత రిటర్నింగ్ అధికారి కి నామినేషన్ పత్రాల్లతో పాటు డిపార్ట్ మెంట్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ కూడా సమర్పించినట్లు ఆయన చెప్పారు.

కరెంట్, వాటర్, టెలికాం శాఖ నుంచి కూడా నో డ్యూ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఒక రోజు గడవు ఇవ్వగా, రిటర్నింగ్ అధికారి వాటిని ఆమోదించలేదు. నామినేషన్ పత్రాలతో ఈ సర్టిఫికెట్లు లేకపోవటం ఒక ముఖ్యమైన లోపమని, దానిని సరిదిద్దలేమని, ఫలితంగా తన నామినేషన్ తిరస్కరణకు గురైందని RO తనతో చెప్పినట్లు నేగి చెప్పారు. ఒకవేళ తన నామినేషన్ తిరస్కరించకుండా ఉండి ఉంటే విజయం సాధించేవాడిని, ఈ క్రమంలోనే కంగనాను అనర్హురాలిగా ప్రకటించాలని లాయక్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కోర్టు కంగనాకు నోటీసులు పంపింది. నోటీసులు జారీ చేస్తూ.. జస్టిస్ జ్యోత్న్యా రేవాల్ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 21 లోగా కంగనా దీనికి సమాధానం చెప్పాలని కోరారు. ప్రస్తుతం దేశ ఇది హాట్ టాపిక్ గా మారింది.

Show comments