బోయపాటి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ! ఇదేమి ట్విస్ట్?

vijay Devarakonda- Boyapati Combo: ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ కాంబో సెట్ కాబోతోందని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఆ కాంబో విన్న తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

vijay Devarakonda- Boyapati Combo: ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ కాంబో సెట్ కాబోతోందని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఆ కాంబో విన్న తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు, ఎలాంటి కాంబో సెట్ అవుద్దో ఊహించడం చాలా కష్టం. స్టార్ మెటీరియల్ అనేది ఎంత కీ పాయింట్ అయినా, సక్సెస్ రేట్ అనేది ఎంత కీలకమైనా.. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్టు పోక తప్పదు. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ కారణంగానే బోయపాటి- విజయ్ దేవరకొండ కాంబో సెట్ కాబోతుందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ తో బిజీగా ఉన్న రౌడీ హీరోకి తనదైన మార్క్ తో మాస్ మసాలా లైన్ సిద్ధం చేశాడట బోయపాటి. ఇంకొన్ని రోజుల్లో హీరోకి నేరేషన్ ఇవ్వబోతున్నట్టు టాక్. ఆల్మోస్ట్ ఈ కాంబో సెట్ అయిపోయింది, నేరేషన్ జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.., అస్సలు ఏ మాత్రం ఊహించని ఈ కాంబో సెట్ కావడం వెనుక చాలానే ప్రయాణం నడించింది.

సరైనోడు తరువాత బోయపాటి డేట్స్ లాక్ చేసుకుంది గీతా ఆర్ట్స్. పుష్ప తరువాత మాస్ సినిమా చేయాలి అన్నది అప్పటి ప్లాన్. అనుకోకుండా పుష్ప రేంజ్ పెరిగిపోతూ వచ్చేసింది. ఇప్పుడు ఏకంగా పుష్ప-3 అనేస్తున్నారు. ఇప్పుడు బన్నీ రీజనల్ మాస్ సినిమాలు చేసే స్థితిలో లేడు. ఆ తరువాత సందీప్ వంగా కూడా ఐకాన్ స్టార్ కోసం ఆల్రెడీ గ్రౌండ్ చేసుకుని ఉన్నాడు. సో.. బన్నీకి ఇప్పుడు బోయాతో మ్యాచ్ అవ్వదు. సరే ఉన్న డేట్స్ అలా వదులుకోలేరు కదా? అందుకే ఈ మాస్ డైరెక్టర్ తో మంచి కథ రెడీ చేయించారు. హీరో కోసం గత నెల రోజులుగా తెగ ప్రయత్నాలు చేశారు. హీరోలు అంతా.., మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దిల్ రాజు దగ్గర బిజీ. అరవింద్ మెగా కాంపౌండ్ లో ట్రై చేద్దాం అనుకుంటే.. అక్కడ బోయ మాస్ ని తట్టుకునే స్టార్స్ ఇప్పుడు ఖాళీగా లేరు. ఇలాంటి స్థితిలోనే దేవరకొండని అప్రోచ్ అయ్యారట.

గీతా ఆర్ట్స్ తో విజయ్ దేవరకొండకి ప్రత్యేకమైన అనుబంధం. కెరీర్ స్టార్టింగ్ లో గీతాగోవిందం ఇచ్చి లైఫ్ సెటిల్ చేసిన విశ్వాసం అది. పైగా.. ఆ బ్యానర్ కూడా విజయ్ కి ముందు నుండి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంది. గతంలోనే ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉన్నా.. అది మెటీరిలైజ్డ్ కాలేదు. సో.. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. విజయ్ ఎలాగో ఫ్యామిలీ స్టార్ తరువాత ఓ మాస్ సినిమా చేయాలి. మాస్ కావాలంటే బోయపాటిని మించిన ఆప్షన్ ఏముంటుంది? సో.. కొని రోజుల్లోనే అఫీషయల్ అనౌన్సమెంట్ వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. ఈ రేర్ కాంబో కలిస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments