Aditya N
Fighter- Operation Valentine: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కానీ, కొత్త తిప్పలు తెచ్చిపెట్టే విధంగా కూడా ఉంది.
Fighter- Operation Valentine: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కానీ, కొత్త తిప్పలు తెచ్చిపెట్టే విధంగా కూడా ఉంది.
Aditya N
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మార్చి 1న “ఆపరేషన్ వాలెంటైన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజానికి గత ఏడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడింది. మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హాడా దర్శకత్వం వహించారు. నిన్న ఆపరేషన్ వాలెంటైన్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అయితే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ హ్రితిక్ రోషన్ ఫైటర్ సినిమా గుర్తుకు వచ్చింది.
ఆపరేషన్ వాలెంటైన్ కాస్త పరిశీలిస్తే ‘ఫైటర్’తో చాలా పోలికలు కనిపిస్తాయి. రెండు చిత్రాల్లో కథ దాదాపు ఒకటే. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ మీదే రెండు సినిమాలూ తెరకెక్కాయి. హీరో అందులో, ఇందులో ఫైటర్ పైలటే. కాగా హీరో క్యారెక్టర్ కూడా రూల్స్ లెక్క చేయకుండా తను అనుకున్నది మాత్రమే చేస్తాడు అని చూపించారు. ఇక పైన చెప్పుకున్న పుల్వామా దాడి ప్రస్తావనతో పాటు హీరో హీరోయిన్ల రొమాన్స్ కూడా ఫైటర్ సినిమాలానే ఉంది. అక్కడ హ్రితిక్ తనతో పాటు ఎయిర్ ఫోర్స్ లో పని చేసే దీపికాతో రోమాన్స్ చేస్తే… ఇక్కడ వరుణ్ తేజ్ – మానుషి చిల్లర్ ప్రేమకథ కూడా అలానే ఉంది.
అయితే ఫైటర్, ఆపరేషన్ వాలెంటైన్ రెండు సినిమాలూ ఒకే సంఘటన ఆధారంగా తెరకెక్కినా… కథనంలో తేడా ఉంటుందని వరుణ్ తేజ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. “మాది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించిన సినిమా. నేను ఫైటర్ చూడలేదు. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని తీసుకువస్తున్నామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మా సినిమాలో చూపించినవన్నీ ఎయిర్ ఫోర్స్ లో చాలా కామన్ గా జరుగుతాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆపరేషన్ వాలెంటైన్ అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు. ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ పైలట్ల మధ్య స్నేహ సంబంధాలను కూడా చూపిస్తుంది” అని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో ఆపరేషన్ వాలెంటైన్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా అన్నారు.