iDreamPost
iDreamPost
ఎంతలేదన్నా ఆర్ఆర్ఆర్ టాక్ తో సంబంధం లేకుండా హీనపక్షం రెండు మూడు వారాలు సునామి రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతుంది. మొదటి వారం టికెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తర్వాత థియేటర్లకు వస్తారు. చాలా చోట్ల రెండు మూడు వారాల కనీస రన్ కు అగ్రిమెంట్లు జరిగాయి. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే. అయితే కేవలం వారం గ్యాప్ లో ఏప్రిల్ 1న మిషన్ ఇంపాజిబుల్ విడుదలకు రెడీ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. కొద్దిరోజుల క్రితమే రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు కానీ నిజంగా ఇది మంచి కాన్ఫిడెన్స్.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్టుతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్వరూప్ దర్శకత్వం వహించిన మిషన్ ఇంపాజిబుల్ ఒక క్రైమ్ కం థ్రిల్లింగ్ డ్రామా. ముగ్గురు చిన్నపిల్లలు ప్రధాన పాత్రధారులు. తాప్సీ వీళ్ళను లీడ్ చేసే ముఖ్యమైన పాత్రను చేసింది.. మాఫియా బ్యాక్ డ్రాప్ ను టచ్ చేస్తూ పూర్తి ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ లో దీన్ని తీర్చిదిద్దారు. పబ్లిసిటీ కూడా మెల్లగా పెంచుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ వచ్చిన ఏడు రోజులకే మిషన్ ఇంపాజిబుల్ లాంటి మీడియం బడ్జెట్ మూవీ రిస్క్ కి సిద్ధపడటం చూస్తే కంటెంట్ మీద గట్టి నమ్మకం కనిపిస్తోంది. 26 నుంచి కొత్త ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారు.
అలా అని చిక్కులు లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మిషన్ ఇంపాజిబుల్ దాని ముందు ధీటుగా నిలవాలంటే అలాంటి టాకే దీనికీ రావాలి. అప్పుడే ఆడియన్స్ రెండో ఛాయస్ గా పెట్టుకుంటారు. రాజమౌళి టీమ్ చేస్తున్న హడావుడి, ఈవెంట్లు గట్రా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. పైగా నాన్ స్టాప్ గా ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నారు. మరి మిషన్ ఇంపాజిబుల్ స్ట్రాటజీ ఏంటో చూడాలి. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ మూవీలో హర్ష్ రోషన్, భాను ప్రకాషన్, జయతీర్థ మొలగు ముగ్గురు చిచ్చరపిడుగులుగా నటించారు. వేరే పోటీ ఇంకేదీ లేదు కాబట్టి మిషన్ ఇంపాజిబుల్ కి ఓ అడ్వాంటేజ్ అయితే ఉంది చూద్దాం.
Also Read : Bro Daddy : మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న డాడీ