iDreamPost
android-app
ios-app

ఆలియా భట్ కోసం రేర్ శారీ! 1905 గంటలు.. 163 మంది కష్టపడి చేశారు!

  • Published May 07, 2024 | 2:56 PM Updated Updated May 07, 2024 | 2:56 PM

Met Gala 2024 Alia Bhatt: చీర కట్టులో ఆడవారు ఎంత అందంగా ఉంటారో.. మరోసారి ప్రపంచ వేదిక మీద నిరూపించింది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌. ఆ వివరాలు..

Met Gala 2024 Alia Bhatt: చీర కట్టులో ఆడవారు ఎంత అందంగా ఉంటారో.. మరోసారి ప్రపంచ వేదిక మీద నిరూపించింది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌. ఆ వివరాలు..

  • Published May 07, 2024 | 2:56 PMUpdated May 07, 2024 | 2:56 PM
ఆలియా భట్ కోసం రేర్ శారీ! 1905 గంటలు.. 163 మంది కష్టపడి చేశారు!

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వస్త్రధారణలు ఉన్నా.. ఎన్ని రకాల అధునాతమైన ఫ్యాషన్‌లు వచ్చినా సరే.. వాటన్నింటికి పోటీగా.. ధీటుగా నిలిచే వస్త్రధారణ చీరకట్టు. ఆడవాకి అందాన్ని మరింత పెంచేది చీర. భారతీయ మహిళలను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు గౌరవిస్తారంటే.. అందుకు కారణం మన చీర కట్టు. ఇక దీనిలో ఎన్నో రకాలు. ఒక్కో ప్రాంతానికి.. ఒక్కో రకమైన చీర కట్టు మన దేశ ప్రత్యేకత. విదేశీ వనితలు సైతం భారతీయ చీరల మీద మనసు పారేసుకుంటారు. కానీ చీరకట్టు.. మన భారతీయ మహిళలకు నప్పినంత బాగా.. అందంగా ఇంకా ఎవరికి సూట్‌ కాదు. ఇక ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ఎందరో సెలబ్రిటీలు.. చీర కట్టులో మెరిశారు. మిగతా వారిని డామినేట్‌ చేశారు. ఇక తాజాగా మెట్‌గాలా ఈవెంట్‌లో మరోసారి మన చీరకట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఈ చీర ఫొటోలు దర్శనం ఇస్తున్నాయి. ఆ వివరాలు..

తాజాగా మెట్‌ గాలా ఈవెంట్‌లో పాల్గొన్న ఆలియా భట్‌.. చీర కట్టుతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంది. మెట్‌ గాలా అనగానే విభిన్నమైన డ్రెస్‌లు గుర్తుకు వస్తాయి. హాలీవుడ్‌ తారలే కాక ఈ ఈవెంట్‌లో పాల్గొనే ఇండియన్‌ సెలబ్రిటీలు సైతం.. లాంగ్‌ ఫ్రాక్‌లలోనే ఎక్కువగా దర్శనం ఇస్తుంటారు. కానీ వారికి భిన్నంగా ఈ ఏడాది మెట్‌ గాలా రెడ్‌ కార్పెట్‌పై ఆలియ భట్‌.. శారీలో మెరిసిపోయింది. చీర కట్టులో ఆమె అందాన్ని చూసి ప్రపంచం ఫిదా అయ్యింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రతి ఏటా న్యూయార్స్‌లో మెట్‌గాలా మెగా ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలంతా ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా మెట్‌ గాలా వేడుక నిర్వహించారు. ఈ క్రమంలో అందరికి భిన్నంగా ఆలియా భట్‌.. చీరలో.. మెట్‌ గాలా రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సబ్యసాచి ఈ చీరను డిజైన్‌ చేశాడు. ఈ షిమ్మరీ శారీని డిజైన్‌ చేయడం కోసం సుమారు 163 మంది డిజైనర్లు.. ఏకంగా 1905 గంటల పాటు శ్రమించారు. ఇక ఈ చీరను ఇటలీలోనే డిజైన్‌ చేశారు. గార్డెన్‌ ఆఫ్‌ టైమ్‌ అనే థీమ్‌తో తయారు చేసిన ఈ చీర.. అంతర్జాతీయ వేదిక మీద మరో సారి భారతీయ సంస్కృతిని ప్రతిబించింది. ఇక ఈ చీర కట్టులో ఆలియా భట్‌ ఎంతో అందంగా మెరిసిపోయింది.

ఈ సందర్భంగా ఆలియా భట్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ మూమెంట్‌ కోసం నేను ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నాను. ఈ క్షణం నేను ఎంతో ఆత్రుతగా.. ఆనందంగా  ఉన్నాను. ఈ చీరను సబ్యసాచి ముఖర్జీ డిజైన్‌ చేశారు. నేను మెట్‌ గాలాలో పాల్గొనడం ఇది రెండో సారి.. చీరలో కనిపించడం ఇదే మొదటి సారి. ఈ శారీ నా అందాన్ని పెంచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ చీరను కట్టుకోవడాన్ని నేను ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. చీర కట్టులో ఆలియా అందం మరింతి పెరిగింది.. చూపు తిప్పుకోనివ్వడం  లేదంటూ నెటిజనులు కామెంట్స్‌ చేస్తున్నారు.