iDreamPost
android-app
ios-app

Indra Collections: ఇంద్ర రీ రిలీజ్.. ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్! మెగాస్టార్ రేంజ్ ఇది..

  • Published Aug 23, 2024 | 10:52 AM Updated Updated Aug 23, 2024 | 12:15 PM

Indra Re-release 4K Collections: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22న 'ఇంద్ర' మూవీని రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్నేళ్ల తర్వాత కూడా మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద సింహ గర్జన చేశాడు.

Indra Re-release 4K Collections: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22న 'ఇంద్ర' మూవీని రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్నేళ్ల తర్వాత కూడా మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద సింహ గర్జన చేశాడు.

  • Published Aug 23, 2024 | 10:52 AMUpdated Aug 23, 2024 | 12:15 PM
Indra Collections: ఇంద్ర రీ రిలీజ్.. ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్! మెగాస్టార్ రేంజ్ ఇది..

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన హిట్ సినిమాలను మేకర్స్ మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అప్పుడు ఏ రేంజ్ లో దుమ్మురేపాయో.. ఇప్పుడు సైతం అదే రేంజ్ లో సత్తాచాటుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22న ‘ఇంద్ర’ మూవీని రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్నేళ్ల తర్వాత కూడా మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద సింహ గర్జన చేశాడు. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పాడు.

‘ఇంద్ర’.. 2002లో బి. గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఫ్యాక్షన్, యాక్షన్ డ్రామా. మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో కేవలం 10 కోట్లు పెట్టిన ఈ చిత్రం ఏకంగా రూ. 55 కోట్లను కొల్లగొట్టింది. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఇక 22 ఏళ్ల తర్వాత చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేశారు. సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ.. మళ్ళీ అదేస్థాయి గర్జనను బాక్సాఫీస్ వద్ద చూపించాడు మెగాస్టార్. ఈ క్రమంలో ఓ ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.

Indra Re release

తెలుగు రాష్ట్రాలతో పాటుగా యూఎస్ లో కూడా ఇంద్ర మూవీ గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది. కాగా.. యూఎస్ మార్కెట్ లో ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. అక్కడ రీ రిలీజ్ అయిన సినిమాల్లో తొలిరోజే 50 వేలకు పైగా గ్రాస్ ను డాలర్ల రూపంలో అందుకుంది. దాంతో ఇంతకు ముందు ఉన్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టేశాడు మెగాస్టార్. దీంతో అప్పట్లోనే ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టిన ఇంద్ర మూవీ రీ రిలీజ్ లో కూడా అదే రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş