iDreamPost
android-app
ios-app

VD12లో హీరోయిన్ ఫిక్స్.. శ్రీలీల- తృప్తి ధిమ్రీ కాదు మహేశ్ బ్యూటీ!

  • Published Feb 01, 2024 | 8:53 PM Updated Updated Feb 01, 2024 | 8:53 PM

Vijay Devarakonda Got New Heroine: విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఎట్టకేలకు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. ఈసారి ఆ ఛాన్స్ మహేశ్ హీరోయిన్ కి దక్కింది.

Vijay Devarakonda Got New Heroine: విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఎట్టకేలకు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. ఈసారి ఆ ఛాన్స్ మహేశ్ హీరోయిన్ కి దక్కింది.

  • Published Feb 01, 2024 | 8:53 PMUpdated Feb 01, 2024 | 8:53 PM
VD12లో హీరోయిన్ ఫిక్స్.. శ్రీలీల- తృప్తి ధిమ్రీ కాదు మహేశ్ బ్యూటీ!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు గట్టిగానే కృషి చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఖుషీ చిత్రం కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా.. ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం రీచ్ కాలేదు. ఈ రౌడీ హీరో తన తర్వాతి చిత్రం ఫ్యామిలీ స్టార్ మీదనే ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యామిలీ స్టార్ చిత్రం మే నెలలో విడుదల అవుతుందని చెబుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ 12వ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించి రోజుకొక పేరు బయటకు వస్తోంది. అయితే ఎట్టకేలకు వీడీ12 మూవీకి హీరోయిన్ ని ఫిక్స్ చేశారని చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ నుంచి మూవీ అంటే యూత్ లో ఉండే అంచనాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. తన కెరీర్లో ఎప్పుడూ కూడా విజయ్ దేవరకొండ పోలీస్ డ్రెస్సులో కనిపించలేదు. అలాంటి ఒక కథతోనే రౌడీ హీరో తన 12వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా చాలారోజుల క్రితమే అధికారికంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా శ్రీలీలను అధికారికంగా ప్రకటించారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ మూవీ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ, ఏమైందో తెలియదు గానీ ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. ఎక్కువ సమయం పడుతుండటంతో విజయ్ కూడా ఫ్యామిలీ స్టార్ మీద ఫోకస్ పెట్టాడు. ఆ సమయంలోనే మూవీ ఆగిపోయింది అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి.

ఈ సినిమా కచ్చితంగా వస్తుంది అంటూ నిర్మాత నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోయిన్లకు సంబంధించి చర్చ మొదలైంది. ఈ ప్రాజెక్టులో శ్రీలీల హీరోయిన్ గా చేయడం లేదని వార్తలు బయటకు వచ్చాయి. మరో హీరోయిన్ కోసం వెతుకున్నారంటూ చెప్పారు. ఆ సమయంలోనే యానిమల్ బ్యూటీ తృప్తీ ధిమ్రీ పేరు బాగా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె కూడా హీరోయిన్ కాదని చెబుతున్నారు. ఎట్టకేలకు హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారంట. మహేశ్ గుంటూరు కారంలో చేసిన మీనాక్షి చౌదరీని విజయ్ దేవరకొండ 12వ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇంక ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని.. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫిక్స్ అంటూ బలంగానే టాక్ నడుస్తోంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత వీడీ12 పట్టాలెక్కుతుందని నాగవంశీనే ప్రకటించారు. మీనాక్షి చౌదరి పేరును కూడా ఆయనే ఫిక్స్ చేశారంట.

 

View this post on Instagram

 

A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006)

గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి పాత్రపై నెట్టింట సెటైర్లు పేలిన విషయం తెలిసిందే. ఆమెను కేవలం పని మనిషి పాత్ర కోసం తీసుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు. వాటికి చెక్ పెడుతూ నాగవంశీ మీనాక్షి చౌదరిని విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీలో రౌడీ హీరో ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. విజయ్ ఎప్పుడూ పోలీసుగా చేయకపోవడం, జెర్సీ ఫేమ్ డైరెక్టర్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. మరి.. విజయ్ దేవరకొండ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006)

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom