iDreamPost
android-app
ios-app

ఆ కోరికను ఎలా తీర్చుకోవాలో తెలుసు: మీనాక్షి

  • Author ajaykrishna Updated - 09:58 AM, Mon - 9 October 23
  • Author ajaykrishna Updated - 09:58 AM, Mon - 9 October 23
ఆ కోరికను ఎలా తీర్చుకోవాలో తెలుసు: మీనాక్షి

ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు కోకొల్లలు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకు అవకాశాలు వస్తాయేమో గానీ.. నిలబడటం అనేది సొంత కష్టంతో ప్రూవ్ చేసుకోవాలి. ఆ విషయంలో కొందరు సక్సెస్ అవుతుంటారు.. చాలా వరకు ఫెయిల్ అవుతుంటారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు మాత్రం రెట్టింపు కష్టం పడాల్సి ఉంటుంది. ఎందుకంటే.. అవకాశాలు వీళ్ళే సంపాదించుకోవాలి.. ఆ తర్వాత ప్రూవ్ చేసుకొని పోటీలో నిలబడటం కూడా వీళ్ళే చూసుకోవాలి. ఓ రకంగా లక్ కూడా కలిసి వస్తే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సాధ్యం అవుతుందని ఇప్పటికే చాలా మంది ప్రూవ్ చేశారు. తాను కూడా కెరీర్ లో రెట్టింపు కష్టాలను చూసానని అంటోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి.

తల్లి సపోర్ట్ తో చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ లో అడుగు పెట్టిన మీనాక్షి.. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. యంగ్ స్టర్స్ నుండి సూపర్ స్టార్స్ వరకు మీనాక్షికి అవకాశాలు ఇస్తున్నారు. అందంతో పాటు అభినయం పరంగాను మీనాక్షి ప్రూవ్ చేసుకుంటుంది. హర్యానాకు చెందిన ఈ భామ.. డాక్టర్ అవ్వాలని బిడిఎస్ చదివే టైమ్ లో తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత నుండి తల్లి సపోర్ట్ తో మోడలింగ్ లోకి వచ్చింది. కూతురిని ఉన్నత స్థితిలో చూడాలని మీనాక్షి తల్లి ఎన్నో అవమానాలు భరించిందట. ఇప్పుడు తన ఎదుగుదల చూస్తూ హ్యాపీ అవుతోందని స్వయంగా మీనాక్షి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఇక ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న మీనాక్షి.. తన లైఫ్ లో మూడు కోరికలు ఉండేవి అని.. వాటిలో రెండు కంప్లీట్ అయ్యాయని అంటోంది. ఇంతకీ ఆ మూడు కోరికలు ఏంటంటే.. మిస్ ఇండియా పోటీలకు వెళ్లడం, బీడీఎస్ పూర్తి చేసి డాక్టర్ అవ్వడం. ఈ రెండు కంప్లీట్ చేసుకున్న మీనాక్షికి ఐఏఎస్ అవ్వాలని కోరిక ఇంకా బ్యాలన్స్ ఉండిపోయిందట. సినిమాలలో ఉంది కాబట్టి.. ఇప్పుడది రియల్ గా సాధ్యం చేసుకోవడం కష్టమైన పని. కాబట్టి.. సినిమాలలో కలెక్టర్ క్యారెక్టర్ చేసి హ్యాపీ అవుతానని చెప్పుకొస్తుంది అమ్మడు. ప్రస్తుతం మీనాక్షి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు సినిమాల పరంగా.. గుంటూరు కారం, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ లతో ఒక్కో సినిమా చేస్తోంది. మరి మీనాక్షి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş