iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు మూవీపై హీరోయిన్ మీనాక్షి క్రేజీ కామెంట్స్!

  • Author ajaykrishna Updated - 05:36 PM, Thu - 4 January 24
  • Author ajaykrishna Updated - 05:36 PM, Thu - 4 January 24
మహేష్ బాబు మూవీపై హీరోయిన్ మీనాక్షి క్రేజీ కామెంట్స్!

ఇండస్ట్రీలో హీరోయిన్స్ హీరోల గురించి మాట్లాడుతుంటే.. ఆయా హీరోల ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. హీరోయిన్స్ ఎంత పాజిటివ్ గా మాట్లాడితే.. వాళ్ల సినిమాలను ఫ్యాన్స్ అంతలా ఎంకరేజ్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఆయన చేస్తున్న సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మీనాక్షి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.

ఆల్రెడీ ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ తో సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. అందులోనూ స్టార్ హీరోల సినిమాలలో త్రివిక్రమ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలిసిందే. పైగా గుంటూరు కారం అని మాస్ టైటిల్ పెట్టాడు కాబట్టి.. ఎలాగైనా మహేష్ బాబును మాస్ హీరోగా ప్రెజెంట్ చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగానే.. టీజర్ లో ‘ఏందీ అట్టా చూస్తున్నావ్ బీడీ త్రిడీలో కనబడుతుందా?’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అయితే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి మీనాక్షి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాలో శ్రీలీల ఓ హీరోయిన్ కాగా.. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇటీవల పూజా హెగ్డే స్థానంలో మీనాక్షిని ఓకే చేశారు త్రివిక్రమ్ టీమ్. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మీనాక్షి.. తనకు గుంటూరు కారం మూవీలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను సూపర్ స్టార్ మహేష్ బాబుకు చాలా పెద్ద ఫ్యాన్ ని. ఈ సినిమాలో నాది ఓ షెడ్యూల్ పూర్తి అయ్యింది. నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మహేష్ గారితో జరిగింది. ఈ సినిమా కోసం నేను ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో ఉండబోతుందని.. సినిమాలో మహేష్ బాడీ లాంగ్వేజ్ మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ కాబోతుందని టాక్. మరి గుంటూరు కారం గురించి మీనాక్షి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom