nagidream
ఇంటర్ చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చింది. ఫస్ట్ సినిమాతోనే స్టార్ అయిపోయింది. మహేష్ తో కలిసి ఒక సినిమాలో కూడా నటించింది. కట్ చేస్తే ఆమె ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీనే వదిలేసి..
ఇంటర్ చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చింది. ఫస్ట్ సినిమాతోనే స్టార్ అయిపోయింది. మహేష్ తో కలిసి ఒక సినిమాలో కూడా నటించింది. కట్ చేస్తే ఆమె ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీనే వదిలేసి..
nagidream
ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే అంత వీజీ కాదు. ఎక్కడో సుడి తిరిగితేనే గానీ సక్సెస్ రాదు. చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నా కొంతమంది లక్ మాత్రమే ఈ పోటీ పరీక్షల్లో పాస్ అయ్యింది. వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. పాస్ కాని వాళ్ళు మాత్రం ఫేడవుట్ అయిపోతున్నారు. ఏం చేస్తున్నారో ఎక్కడుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. కొంతమంది బిజినెస్ లలో స్థిరపడ్డారు. అయితే ఒకప్పుడు మహేష్ తో నటించిన ఈ హీరోయిన్ మాత్రం సక్సెస్ లేక ఇండస్ట్రీ వదిలేసింది. 13 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 19 ఏళ్లకే ఇండస్ట్రీని వదిలేసింది. ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
ఈమె పేరు మయూరి కాంగో. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ నటించిన వంశీ సినిమాలో మయూరి కాంగో సెకండ్ హీరోయిన్ గా నటించింది. స్నేహ అనే పాత్రలో నటించింది. ఈ మూవీలో వంశీ ఫ్రెండ్ గా నటించింది. వంశీని లవ్ చేసే అమ్మాయిగా ఎమోషనల్ సీన్ లో చాలా బాగా నటించింది. 1995లో నసీం అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె ఇంటర్ చదువుతుంది. ఇంటర్ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. 2000వ సంవత్సరంలో ఏకంగా 5 సినిమాలకు సైన్ చేసింది. వాటిలో వంశీ ఒకటి. ఆ తర్వాత ఏడాది ఒకే ఒక్క సినిమా చేసింది. జీతేంగే హమ్ అనే సినిమా తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు.
అవకాశాలు లేక సినిమాలకు దూరమైంది. ఈమె చేసిన సినిమాలు కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. కరిష్మా, కిట్టీ పార్టీ, రంగోలి వంటి పలు టీవీ షోస్ చేసింది. అవకాశాలు రాకపోవడంతో ఇక ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి 2003లో ఆదిత్య ధిల్లాన్ అనే ఎన్ఆర్ఐని వివాహం చేసుకుంది. ఛత్రపతి శంభాజీ నగర్ లో 2003 డిసెంబర్ 28న వీరి వివాహం జరిగింది. 2011లో వీరికి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత ఆమె భర్తతో న్యూయార్క్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ బరూచ్ కాలేజీకి చెందిన జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత పెర్ఫార్మిక్స్ అనే డిజిటల్ మీడియా ఏజెన్సీలో మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసింది.
ప్రస్తుతం ఆమె గూగుల్ ఇండియాలో ఏజెన్సీ బిజినెస్ ఇండియా ఇండస్ట్రీ హెడ్ గా పని చేస్తుంది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ రాలేదని నిరుత్సాహపడకుండా ఆమె గూగుల్ లో ఉద్యోగం సంపాదించి కూడా సక్సెస్ అయ్యారు. ఒక దాంట్లో సక్సెస్ అవ్వకపోతే మరొకదాంట్లో సక్సెస్ అయి చూపించాలని.. దాని కోసం దారులు మనమే వేసుకోవాలని మయూరి కాంగో నిరూపించింది. సినిమాలు మాత్రమే జీవితం కాదు.. ప్రతీ దాంట్లో లైఫ్ ఉంటుందని ప్రూవ్ చేసిన మయూరి కాంగోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.