Krishna Kowshik
రాఘవ లారెన్స్- అక్కినేని నాగార్జున కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ మాస్. 2004లో క్రిస్మస్ సమయంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు నాగార్జున కెరీర్‌లో (అప్పటి వరకు) హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టుకున్న చిత్రంగా నిలిచింది. ఇక ఇందులో స్టైలిష్ విలన్ రోల్ పోషించిన నటుడు గుర్తున్నాడా..?
రాఘవ లారెన్స్- అక్కినేని నాగార్జున కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ మాస్. 2004లో క్రిస్మస్ సమయంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు నాగార్జున కెరీర్‌లో (అప్పటి వరకు) హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టుకున్న చిత్రంగా నిలిచింది. ఇక ఇందులో స్టైలిష్ విలన్ రోల్ పోషించిన నటుడు గుర్తున్నాడా..?
Krishna Kowshik
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ పడి సక్సెస్ పొందాడు రాఘవ లారెన్స్. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడి.. రాఘవేంద్ర స్వామిని నమ్ముకుని కోలుకున్నాడు. ఇండస్ట్రీలో సైడ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ చేసిన లారెన్స్.. అనతికాలంలోనే కొరియోగ్రాఫర్‌గా మారాడు. అతడికి హీరోగా అవకాశం ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ. హీరోగా సక్సెస్ అయ్యాడు. అలాగే దర్శకుడిగా మారే క్రమంలో మరోసారి టాలీవుడ్డునే నమ్ముకున్నాడు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. తొలి మూవీ మాస్‌తోనే సక్సెస్ కొట్టాడు. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు. తొలి మూవీలోనే బిగ్గెస్ట్ స్టార్ అక్కినేని నాగార్జునతో వర్క్ చేసే అవకాశాన్ని కొల్లగొట్టాడు లారెన్స్. 2004లో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాగార్జున కెరీర్‌లో (అప్పటి వరకు) హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టుకున్న చిత్రంగా నిలిచింది
దీన్ని తమిళంలో వీరన్, హిందీలో మేరీ జగ్- వన్ మ్యాన్ ఆర్మీ పేరుతో డబ్ చేయగా, బంగ్లాదేశీ భాషలో రీమేక్ అయ్యింది. ఇందులో జ్యోతిక, ఛార్మీ హీరోయిన్లుగా నటించారు. రఘువరన్, ప్రకాష్ రాజ్, సునీల్,ధర్మవరపు సుబ్రమణ్యం, వేణు మాధవ్, సత్యం రాజేశ్, వర్ష, రుతిక నటించారు. తనురాయ్ ఓ ప్రత్యేకమైన పాత్రలో మెరిసింది. ఇక ఇందులో రఘువరన్ నెగిటివ్ రోల్ అయినప్పటికీ.. పేరు వచ్చింది మాత్రం శేషు పాత్రకు. ఇందులో హీరోయిన్ అన్నగా కనిపించిన నటుడు రాహుల్ దేవ్. విశాఖ పట్నం శేషుగా అలరించాడు. రాహుల్ దేవ్ అసలు పేరు రాహుల్ దేవ్ కౌశల్. ఢిల్లీలో పుట్టిన అతడు.. మోడల్ ఆ తర్వాత నటుడిగా మారాడు. ఆయన తండ్రి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా వర్క్ చేశారు. రాహుల్ టచ్ చేయన ఇండస్ట్రీ లేదేమో బహుశా. తొలుత హిందీ ఆ తర్వాత తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో తన విలనీజంతో మెస్మరైజ్ చేశాడు.
హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, బోజ్ పురి, గుజరాతీ, పంజాబీ, ఒడియా భాషల్లో నటించారు. ఆకాశ వీధిలో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ దేవ్.. టక్కరి దొంగలో నటించాడు. సింహాద్రి, సీతయ్య, ఆంధ్రావాలా తర్వాత మాస్ మూవీలో నటించాడు. అందరికీ రిజస్టర్ అయ్యాడు. విద్యార్థి, నరసింహుడు, అతడు, అల్లరి పిడుగు, జై చిరంజీవ, అస్త్రం, చిన్నోడు, పౌర్ణమి, ఒక్కడున్నాడు, మున్నా, తులసి,బ్యాంక్ వంటి చిత్రాలు చేశాక మూడేళ్ల గ్యాప్ ఇచ్చి వీర మూవీతో పలకరించాడు. దడ, లవ్లీ, దమ్ము, షాడో, నాయక్, భాయ్, ఎవడు, లౌక్యం, ఒక్క అమ్మాయి తప్ప, ఇంటిలిజెంట్ మూవీల్లో చేశాడు. స్టైలిష్ విలన్‌గా పేరు తెచ్చుకున్న ఈ నటుడు 2018 తర్వాత తెలుగు ఇండస్ట్రీని పలకరించలేదు. ప్రస్తుతం హిందీ బెంగాలీ, మరాళీ చిత్రాలు చేస్తున్నాడు రాహుల్ దేవ్. మళ్లీ తెలుగులో నటిస్తాడేమో ఈ టాలెంట్ విలన్.