Swetha
Maruthi Nagar Subramanyam Movie Satellite Partner: థియేటర్స్ లో కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూడడం కంటే.. ఇప్పుడు ఆ సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు పెరిగిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు మూవీ శాటిలైట్ డీల్ కూడా ముందుగానే క్లోజ్ చేస్తున్నారు మేకర్స్.
Maruthi Nagar Subramanyam Movie Satellite Partner: థియేటర్స్ లో కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూడడం కంటే.. ఇప్పుడు ఆ సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు పెరిగిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు మూవీ శాటిలైట్ డీల్ కూడా ముందుగానే క్లోజ్ చేస్తున్నారు మేకర్స్.
Swetha
ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని… ప్రస్తుతం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా థియేట్రికల్ రిలీజ్ కు ముందుగానే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలకు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత.. ఆ సినిమా టాక్ ను బట్టి.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్.. పోటీ పడుతుంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీ డీల్ తో పాటు శాటిలైట్ డీల్ ను కూడా ముందుగానే ముగించేసుకుంటున్నారు మేకర్స్. సో ఇలా థియేట్రికల్ రిలీజ్ కు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు రీసెంట్ గా థియేటర్ లో అడుగుపెట్టిన మారుతి నగర్ సుబ్రమణ్యం శాటిలైట్ డీల్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో థియేటర్ లో చిన్న సినిమాలే పెద్ద హిట్స్ అందుకుంటున్నాయి. ఇప్పటికే ఈ నెలలో కమిటీ కుర్రాళ్ళు, ఆయ్ సినిమాలు మంచి టాక్ సంపాదించుకోగా.. ఇప్పుడు ఓ మంచి ఫ్యామిలీ డ్రామాగా థియేటర్ లో అడుగుపెట్టిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం ‘ మూవీకి కూడా పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. ఈ సినిమాలో రావు రమేష్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ శాటిలైట్ డీల్ భారీ ధరలకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థ జీ తెలుగు సొంతం చేసుకుంది. ఇక ఓటీటీ హక్కులు మాత్రం ఇంకా ఎవరికీ ఇవ్వలేదని సమాచారం. త్వరలోనే ఈ డీల్ ను కూడా క్లోజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ముఖ్యంగా రావు రమేష్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కామెడీకి, స్క్రీన్ ప్లే కు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య ఎలాగూ ప్రేక్షకులంతా .. రొటీన్ యాక్షన్ డ్రామాస్ కు కాకుండా.. రెగ్యులర్ టచ్ తో ఉండే.. వారికి కనెక్ట్ అయ్యే కథలనే ఆదరిస్తున్నారు. కాబట్టి లాంగ్ రన్ లో ఈ మూవీ కూడా మంచి సక్సెస్ ను అందుకుంటుందని.. చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఓ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమా శాటిలైట్ డీల్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.