iDreamPost
android-app
ios-app

69th Filmfare Awards: ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చినా హ్యాపీగా లేను! స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్..

  • Published Aug 05, 2024 | 1:10 PM Updated Updated Aug 05, 2024 | 1:12 PM

ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చినా గానీ.. తాను సంతోషంగా లేనని ఓ స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ హీరో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చినా గానీ.. తాను సంతోషంగా లేనని ఓ స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ హీరో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

69th Filmfare Awards: ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చినా హ్యాపీగా లేను! స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్..

ఫిల్మ్ ఫేర్ సౌత్ ఇండియన్ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. విజేతలుగా నిలిచిన తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ నటీ, నటులకు పురస్కారాలను అందించారు. ఓ స్టార్ హీరో తన కెరీర్ లోనే 15వ  ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డ్ అందుకున్నప్పటికీ.. తాను సంతోషంగా లేనని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు సదరు హీరో. ప్రస్తుతం ఆ హీరో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ స్టార్ హీరో ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి?

69వ ఫిల్మ్ ఫేర్ సౌత్ ఇండియా అవార్డ్స్ 2024 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో హీరోలు, హీరోయిన్స్, నటీ, నటులు తళుక్కున మెరిశారు. ఇక మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘నాన్పకల్ నెరతు మయక్కమ్’ అనే సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును విక్రమ్, సిద్ధార్థ్ చేతులమీదుగా అందుకున్నాడు మమ్ముట్టి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

“ఇది నాకు 15వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్. నిజానికి ఈ సమయంలో నేను ఎంతో సంతోషంగా ఉండాలి. కానీ.. ఈ అవార్డు వచ్చిన ఈ క్షణం నేను ఆనందంగా లేను. దానికి కారణం.. కేరళ ప్రకృతి విపత్తు. వయనాడ్ లో వరదలు సృష్టించిన బీభత్సానికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. వారిని చూస్తే నా మనసు కలిచి వేస్తోంది. మీరు కూడా బాధితులకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ కు గురైయ్యాడు ఈ స్టార్ హీరో. కాగా.. వయనాడ్ బాధితులకు రూ. 20 లక్షల భారీ విరాళం ప్రకటించారు మమ్ముట్టి. ఈ హీరోతో పాటుగా టాలీవుడ్ హీరోలు కూడా తమ గొప్ప మనసును చాటుకుంటూ భారీ విరాళాలు ప్రకటించారు.