Krishna Kowshik
ఈ చిన్నారి కేవలం సౌత్ సినిమాలతో అందులోనూ మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియన్ లెవల్ క్రేజ్ దక్కించుకుంది..? గ్లామర్ షో చేయకుండానే వరసు ఛాన్సులు దక్కించుకుంటూ బిజీయెస్ట్ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరో తెలుసా...?
ఈ చిన్నారి కేవలం సౌత్ సినిమాలతో అందులోనూ మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియన్ లెవల్ క్రేజ్ దక్కించుకుంది..? గ్లామర్ షో చేయకుండానే వరసు ఛాన్సులు దక్కించుకుంటూ బిజీయెస్ట్ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరో తెలుసా...?
Krishna Kowshik
ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం నాలుగు పాటలు, నాలుగు సీన్లకు పరిమితమయ్యారు. గ్లామరస్ పాత్రలకే పరిమితమయ్యేవారు. కానీ కాలం మారింది. సినిమా చూస్తున్న కోణం కూడా మారడంతో దర్శకులు, నిర్మాతలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టు మూవీస్ తీస్తున్నారు. ఇక నటీమణుల విషయంలో కూడా మార్పులు సంతరించుకున్నాయి. ఉమెన్ సెంట్రిక్, లేడీ ఓరియెంట్ చిత్రాలు వస్తున్నాయి. నటనా, కథా ప్రాథాన్యమున్న సినిమాలు తీస్తున్నారు. వీరిలో ముందు వరుసలో ఉంటోంది ఈ ఫోటోలోని చిన్నారి. తండ్రి చేతిలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నది హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడమే కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన ఐదేళ్లలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును కొల్లగొట్టింది. తెలుగులో ఆమె సినిమాలు చేయకపోయినా.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయ్యింది. ఆమె ఎవరో కాదు వర్సటైల్ హీరోయిన్ అపర్ణా బాల మురళి.
కేరళ నీళ్లల్లోనో లేక కొబ్బరి నూనెలోనో ఏదో మాయ ఉంది. ఇలా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి..యాక్టింగ్‌లో ఓనమాలు త్వరగా నేర్చుకుని దక్షిణాది ఇండస్ట్రీని ఏలేస్తుంటారు. అపర్ణా కూడా కేరళ కుట్టీనే. త్రిసూర్‌లో మ్యూజిక్ డైరెక్టర్ బాల మురళి మీనన్, శోభా దంపతులకు జన్మనిచ్చింది. చదువు పూర్తయ్యాక మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒరు సెకండ్ క్లాస్ యాత్ర మూవీతో ఎంట్రీ ఇచ్చిన అపర్ణా.. మహేషింటే ప్రతీకారం మూవీతో పాపులర్ అయ్యింది. తక్కువ సమయంలో మలయాళ, తమిళ సినిమాల్లో బిజీ బ్యూటీగా మారిపోయింది. ఎక్స్ పోజింగ్ చేయకుండానే సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యింది. సూరారై పొట్రు మూవీతో (తెలుగులో ఆకాశమే హద్దురా) టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందింది. 8 తొట్టక్కల్ మూవీతో తమిళ ఇండస్ట్రీలో అడు గుపెట్టిన ఆమె సర్వం తాళ మయం మూవీతో ఫేమ్ తెచ్చుకుంది.
సంగీతానికి ప్రాధాన్యతనిచ్చే కుటుంబంలో పుట్టిన నేపథ్యంలో ఆమె కూడా సాంగ్స్ పాడటంతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. మలయాళం, తమిళ చిత్రాలతోనే పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకోవడం కేవలం అపర్ణాకే సాధ్యమేమో అనిపిస్తుంది. లేడీ ఓరియెంట్, కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ.. తన కంటూ సెపరేట్ ట్రాక్ ఏర్పాటు చేసుకుంది. ఇని ఉత్తరం, కప్ప, 2018, థూమం చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల రాయన్ మూవీలో మేఖల పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మూడు కూడా మలయాళ చిత్రాలే. ఉలా, రుధిరం, మిండియుమ్ పరాంజుమ్ వంటి మూవీస్ చేస్తోంది. ఒకటి, రెండు సినిమాలకే తెలుగులో వాలిపోతున్నారు మాలీవుడ్ బ్యూటీలు. మరీ ఈ సీతా కోక చిలుక టాలీవుడ్ లో వాలేది ఎప్పుడో..? వస్తే మాత్రం పక్కా రూల్ చేయడం ఖాయం.