iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూత

Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ళ వయసులో బెన్నీ గుండెపోటుతో చనిపోవడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ళ వయసులో బెన్నీ గుండెపోటుతో చనిపోవడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూత

ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతున్నారు. సినిమాల్లో నటించే నటులు ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తారు. బాడీ ఫిట్ నెస్ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. పౌష్టికాహారం తీసుకుంటారు. అయినప్పటికీ పలువురు నటులు గుండెపోటుకు గురై తుది శ్వాస విడుస్తున్నారు. గుండె పోటు మరణాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో మరో యాక్టర్ కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ గుండెపోటుతో మరణించారు. తిరువనంతపురంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 37 ఏళ్ళ వయసులో బెన్నీ గుండెపోటుతో చనిపోవడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆయన మరణ వార్తను నిర్మాత సంజయ్ పడియూర్ బరువెక్కిన హృదయంతో స్పెషల్ నోట్ రాసి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బెన్నీ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 2012లో ‘నవగాథార్కు స్వాగతం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆమెన్’లో కొచ్చాచన్ అనే జూనియర్ పూజారి పాత్రలో తన అద్భుతమైన నటనతో బెన్నీ ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.