iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కళాభవన్ హనీఫ్ గురువారం కన్నుమూశారు. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కళాభవన్ హనీఫ్ గురువారం కన్నుమూశారు. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

గత కొంత కాంత కాలం ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నటుడు ఈశ్వరరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ ప్రముఖ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ హనీఫ్ (63) గురువారం మృతి చెందారు. అయితే, గత కొంత కాలం నుంచి ఆయన శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల ఆయన పరిస్థితి విషమించడంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆయన గురువారం కన్నుమూశారు. కళాభవన్ మృతితో సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కేరళ ఎర్నాకులంకు మట్టంచేరికి చెందిన కళాభవన్ హనీఫ్ నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణించారు. ఆయన దాదాపు 150 పైగా చిత్రాల్లో నటించినట్లు సమాచారం. ఇక చదువు పూర్తైన వెంటనే కళాభవన్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా కొనసాగారు. అలా ఆర్టిస్ట్ గా రాణిస్తూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మూవీలో నటించే అవకాశాలు వచ్చాయి. దీంతో అంది వచ్చిన అవకాశాలతో కళాభవన్ అనేక చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపును మూట గట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన గత కొంత కాలం నంచి శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన తాజాగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మట్టంచెరలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కళాభవన్ హనీఫ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆయన చివరి సారిగా నటించిన చిత్రం జలధార పంపు సెట్.