iDreamPost
android-app
ios-app

Allu Arjun: దేవర కోసం అల్లు అర్జున్? మేకర్స్ మాస్టర్ ప్లానింగ్..

  • Published Sep 09, 2024 | 11:53 AM Updated Updated Sep 09, 2024 | 11:53 AM

Allu Arjun Jr. NTR special interview in Devara promotions: దేవర ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా అల్లు అర్జున్, తారక్ లతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Allu Arjun Jr. NTR special interview in Devara promotions: దేవర ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా అల్లు అర్జున్, తారక్ లతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Allu Arjun: దేవర కోసం అల్లు అర్జున్? మేకర్స్ మాస్టర్ ప్లానింగ్..

దేవర.. మరికొన్ని రోజుల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించడానికి అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 10న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ వేడుకకోసం ఒకరోజు ముందుగానే ముంబై చేరుకున్నాడు తారక్. అక్కడి నుంచే ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఫేమ్ తో తారక్ బాలీవుడ్ లో జెండా పాతిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని దేవరతో మరింత స్ట్రాంగ్ గా చేయాలనుకుంటున్నాడు. అందుకు తగ్గట్లుగానే భారీ ప్లానింగ్స్ తో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దేవర కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తాడన్న న్యూస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో దేవర ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 10న ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా దాని కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే తారక్ ముంబై చేరుకున్నాడు. ట్రైలర్ లాంచ్ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సాలిడ్ ప్రమోషన్లు ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దేవర కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తాడన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందుకోసం మేకర్స్ కూడా మాస్టర్ ప్లానింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్-బన్నీ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు కూడా బావా.. బావా అని చనువుగా పిలుచుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరితో కలిసి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? అన్నది మేకర్స్ మదిలో మెదిలిన ఆలోచన.

దేవర ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్-తారక్ తో ఓ సరదా ఇంటర్వ్యూని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే.. ఆ ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాంతో పాటుగా దేవరపై అంచనాలు ఇంకాస్త పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇప్పటికే వార్ 2లో యంగ్ టైగర్ నటిస్తుండటంతో బాలీవుడ్ లో కూడా సాలిడ్ కలెక్షన్లు రాబట్టేందుకు అవకాశం ఎంతైనా ఉంది. అయితే.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తారక్ పిలిస్తే.. డేట్స్ సర్ధుబాటు చేసుకుని బన్నీ కచ్చితంగా వస్తాడు. ఒకవేళ వీళ్లిద్దరు కలిసి ఇంటర్వ్యూలో పాల్గొంటే, ప్రమోషన్స్ లో అదే హైలెట్ అవుతుంది. మరి మీలో ఎంత మంది తారక్-బన్నీ ఇంటర్వ్యూ చూడాలని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş