iDreamPost
android-app
ios-app

వీడియో: భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ కు ఏడ్చేసిన సీరియల్ నటి మహేశ్వరి

  • Published Mar 03, 2024 | 2:15 PM Updated Updated Mar 03, 2024 | 2:15 PM

Maheshwari- Siva Nag Viral Video: బుల్లితెర నటి మహేశ్వరి, ఆమె భర్త శివనాగు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు శివనాగు ఇచ్చిన సర్ ప్రైజ్ కి మహేశ్వరి ఏడ్చేసింది.

Maheshwari- Siva Nag Viral Video: బుల్లితెర నటి మహేశ్వరి, ఆమె భర్త శివనాగు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు శివనాగు ఇచ్చిన సర్ ప్రైజ్ కి మహేశ్వరి ఏడ్చేసింది.

  • Published Mar 03, 2024 | 2:15 PMUpdated Mar 03, 2024 | 2:15 PM
వీడియో: భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ కు ఏడ్చేసిన సీరియల్ నటి మహేశ్వరి

సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుఎన్సర్స్ కాకుండా.. సెలబ్రిటీలు కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. తమ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాని మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో ఉన్న స్టార్ల దగ్గర నుంచి బుల్లితెర నటుల వరకు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ అంటూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. వారి లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని వీడియోల రూపంలో ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఆ లిస్టులో సీరియల్ ఆర్టిస్ట్ మహేశ్వరి జంట కూడా ఉంటుంది. తాజాగా వీళ్లు పోస్ట్ చేసిన వీడియోకి ఫ్యాన్స్ అందరూ ఎమోషనల్ అయిపోతున్నారు.

మహేశ్వరి- శివనాగ్ జంట గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి సీరియల్స్ లో మహేశ్వరి యాక్ట్ చేసింది. శివనాగు ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఉన్నాడు. వీళ్లిద్దరు కలిసి ఇస్మార్ట్ జోడీ, ఫ్యామిలీ నెంబర్ 1 వంటి షోస్ లో పాల్గొన్నారు. వీళ్లకు హరిణి అనే కుమార్తె కూడా ఉంది. వీళ్ల వీడియోల్లో హరిణి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరి కంటే హరిణీనే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.

ఇప్పుడు హరిణీకి తోడుగా ఆడుకునేందుకు మరో బుజ్జి పాపాయి రాబోతోంది. ఆ విషయాన్ని వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా గతంలోనే ప్రకటించారు. నిత్యం మహేశ్వరి తన ప్రెగ్నెన్సీ డైట్ ని కూడా ఆడియన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఆమెకు భర్త శివనాగు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆమె కడుపుతో ఉంది కాబట్టి.. ఆమెకు తెలియకుండా సీమంతం ప్లాన్ చేశాడు. ఫంక్షన్ కి కావాల్సినవి మాత్రమే కాకుండా.. భార్య- కుమార్తెకు కావాల్సిన షాపింగ్ కూడా చేసేశాడు. ఫంక్షన్ హాలుకి తీసుకెళ్లే వరకు కూడా మహేశ్వరికి ఆ విషయం చెప్పలేదు. బోటింగ్ కోసం అని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. తర్వాత ఫంక్షన్ హాలుకు తీసుకెళ్లాడు.

ఫంక్షన్ హాలులో మహేశ్వరి ఫ్రెండ్స్, ఆర్టిస్టులు ఉండటంతో చూసి షాకైంది. ఆ షాకు నుంచి తేరుకునేలోపే ఆమెను రెడీ చేసి సీమంతం చేసేశారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న వీళ్ల ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చాలా ఘనందా శివ.. మహేశ్వరి కోసం సీమంతం ప్రాన్ చేశాడు. ఇందులో కేక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. భార్య గర్భానికి భర్త ముద్దుపెడుతున్నట్లు, పక్కనే వారి మొదటి బిడ్డ ఉన్నట్లు కేక్ డిజైన్ చేయించారు. తర్వాత కేక్ కట్ చేశారు. ఈ సమయంలో మహేశ్వరి చాలా ఎమోషనల్ అయ్యింది. తన భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ కి ఏడ్చేసింది. మహేశ్వరిని చూసి మేఘన కూడా ఏడుపు ఆపుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. మహేశ్వరికి సర్ స్ప్రైజ్ సీమంతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet