iDreamPost
android-app
ios-app

Mahesh Babu: ఎట్టకేలకు మహేశ్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తున్న రాజమౌళి.. ఇదే వాళ్ళు కోరుకున్నది!

  • Published Sep 14, 2024 | 4:07 PM Updated Updated Sep 14, 2024 | 4:07 PM

Mahesh Babu new look for SSMB29 fans happy: ఎట్టకేలకు మహేశ్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇన్నేళ్లుగా మేం కోరుకునేది ఇదే అంటూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

Mahesh Babu new look for SSMB29 fans happy: ఎట్టకేలకు మహేశ్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇన్నేళ్లుగా మేం కోరుకునేది ఇదే అంటూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 14, 2024 | 4:07 PMUpdated Sep 14, 2024 | 4:07 PM
Mahesh Babu: ఎట్టకేలకు మహేశ్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తున్న రాజమౌళి.. ఇదే వాళ్ళు కోరుకున్నది!

తమ అభిమాన హీరోను ఇప్పటి వరకు చూడని లుక్ లో చూడాలని ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది. అలా చూపించే డైరెక్టర్ కోసం వారు వేయి కళ్లతో ఎదరుచూస్తూ ఉంటారు. ఇక అలాంటి లుక్ లో కనిపించానలి హీరోలకు సైతం ఉంటుంది. కాగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు చాలా కాలం నుంచి ఓ కోరిక అలాగే ఉండిపోయింది. అయితే వారి డ్రీమ్ తీరే రోజు రానే వచ్చేసింది. ఎట్టకేలకు మహేశ్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇన్నేళ్లుగా మేం కోరుకునేది ఇదే అంటూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. ఏ డైరెక్టర్ వల్ల కానిది.. ఇప్పుడు జక్కన్న వల్ల అవుతోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో 28 సినిమాల్లో నటించాడు. దాదాపు అన్ని సినిమాల్లో క్లీన్ షేవ్ లోనే స్మార్ట్ గా కనిపించాడు. కానీ.. మహేశ్ అభిమానులు మాత్రం అతడిని గుబురు గడ్డం, మీసం కట్టు, లాంగ్ హెయిర్ తో చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వారి కల తీరలేదు. ఏ డైరెక్టర్ కూడా సూపర్ స్టార్ ను ఇలా చూపించలేదు. కానీ రాజమౌళి తాను తెరకెక్కించబోయే SSMB29 మూవీతో ఎట్టకేలకు ఫ్యాన్స్ ఆకలి తీర్చబోతున్నాడు. ఈ చిత్రంలో మహేశ్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్, మీసం కట్టుతో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా తన కుమార్తె తో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు.

మహేశ్ గుబురు గడ్డం, మీసం కట్టు, లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్న లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రిన్స్ ను తాము ఎలా చూడాలని ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్నామో.. అచ్చం అలాగే జక్కన్న తన చిత్రంలో చూపించబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. రాజమౌళి పుణ్యమాని మహేశ్ ను సరికొత్త లుక్ లో చూడబోతున్నారు ఫ్యాన్స్. అయితే ఇంత వరకు సూపర్ స్టార్ ను ఇలాంటి లుక్ లో చూపించడానికి ఏదర్శకుడు కూడా ట్రై చేయలేదు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ రేంజ్ లో ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు జక్కన్న. దాంతో ఈ మూవీని మరింత పకడ్బందీగా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరల్ యాక్షన్ డ్రామా ఈ సినిమా రాబోతోంది. ఇందుకోసం ఇప్పటికే లోకేషన్లను కూడా పరిశీలించారు జక్కన్న అండ్ టీమ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ వర్క్ షాప్ లో ప్రముఖు నటీ, నటులు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. మరి ఇన్నేళ్ల మహేశ్ ఫ్యాన్స్ ఆకలి రాజమౌళి తీరుస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss