iDreamPost
android-app
ios-app

సంక్రాంతి తర్వాతే… రాజమౌళి ఫిక్స్‌ అయ్యాడట!

  • Published Dec 08, 2023 | 3:37 PM Updated Updated Dec 08, 2023 | 3:37 PM

SS Rajamouli, Mahesh Babu:రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటి వరకు తదుపరి సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. మహేష్ బాబు తో సినిమా ఉంటుంది అనే విషయం తప్ప కొత్త విషయం చెప్పడం లేదు. మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

SS Rajamouli, Mahesh Babu:రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటి వరకు తదుపరి సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. మహేష్ బాబు తో సినిమా ఉంటుంది అనే విషయం తప్ప కొత్త విషయం చెప్పడం లేదు. మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

  • Published Dec 08, 2023 | 3:37 PMUpdated Dec 08, 2023 | 3:37 PM
సంక్రాంతి తర్వాతే… రాజమౌళి ఫిక్స్‌ అయ్యాడట!

తెలుగు సినిమా స్థాయిని ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచిన దర్శకుడు రాజమౌళి అనడంలో ఒక్క శాతం కూడా అనుమానం లేదు. రాజమౌళి వేసిన దారిలో ఎంతో మంది స్టార్స్‌ మరియు ఫిల్మ్‌ మేకర్స్ అడుగులు వేస్తూ నడుస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాలంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెలుగు సినిమాలను దేశం మొత్తం విడుదల చేస్తున్నారు అంటే అది కేవలం రాజమౌళి వల్లే అనడంలో కూడా సందేహం లేదు.

రాజమౌళి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయకపోవడం ఆయన అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. గడచిన పదేళ్ల కాలంలో బాహుబలి రెండు పార్ట్‌ లు, ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలను మాత్రమే రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వచ్చి ఏడాదిన్నర దాటినా కూడా ఇప్పటి వరకు రాజమౌళి తదుపరి సినిమాకి క్లాప్ కొట్టలేదు. మరో ఏడాది అయినా తదుపరి సినిమాకు రాజమౌళి క్లాప్‌ కొట్టేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

after pongal rajamouli movie start

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రమోషన్ సమయంలోనే తన తదుపరి సినిమాను మహేష్‌ బాబుతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అందుకు తగ్గట్లుగా ఒక మంచి స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నట్లుగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ ఏడాదిలో కనీసం సినిమా ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు కనీసం అసలు మహేష్ బాబు సినిమా కి సంబంధించిన చిన్న అప్‌డేట్‌ కూడా అఫిషియల్‌ గా రాలేదు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్‌ తో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు.

after pongal rajamouli movie start

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసిన విషయం తెల్సిందే. గుంటూరు కారం పనులు పూర్తై మహేష్ బాబు ఫ్రీ అయిన తర్వాతే రాజమౌళి మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు గుంటూరు కారం విడుదల అయిన వెంటనే చిన్న బ్రేక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే రాజమౌళి తో స్క్రిప్ట్‌ చర్చల్లో మహేష్‌ బాబు పాల్గొంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. రాజమౌళి మనసులో ఇప్పటికే ఏదో ఒక స్టోరీ లైన్ అనుకుని ఉంటాడు. దాన్ని స్క్రిప్ట్‌ గా మల్చేందుకు కూడా రెడీ అయ్యే ఉంటాడు.

after pongal rajamouli movie start

దానికి మహేష్ బాబు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉంటుంది. సంక్రాంతి తర్వాతే ఇవన్నీ జరుగుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి 2024 మరియు 2025 లో రాజమౌళి, మహేష్ బాబు సినిమా కు సంబంధించిన అప్‌డేట్స్ వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం రెండేళ్లు మేకింగ చేసి అంటే 2026 కి గాని వీరి కాంబో సినిమా వచ్చే అవకాశాలు లేవు అనే టాక్ కూడా వినిపిస్తోంది. మహేష్‌, రాజమౌళి కాంబోలో మూవీ ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? ఎలాంటి స్క్రిప్ట్‌ ను మహేష్ బాబు కోసం జక్కన్న రెడీ చేస్తున్నాడని మీరు భావిస్తున్నారు?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişholiganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetdamabet girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet