iDreamPost
android-app
ios-app

రాజమౌళి మూవీ కోసం.. మహేశ్ లుక్ అదిరిపోయిందిగా..

Mahesh New Looks: మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం కఠోర శ్రమ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు.

Mahesh New Looks: మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం కఠోర శ్రమ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు.

రాజమౌళి మూవీ కోసం.. మహేశ్ లుక్ అదిరిపోయిందిగా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఈ పేరు మారుమోగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. దర్శకధీరుడు రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తున్న సినిమా నేపథ్యంలోనే వరల్డ్ వైడ్ గా ఈ ప్రాజెక్ట్ పై బజ్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ పట్టాలెక్కుతుందా అని కేవలం మహేశ్ అభిమానులే కాదు.. సగటు సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఒక్కో అప్ డేట్ ఈ మూవీ అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా మహేశ్ లుక్స్ కూడా అందుకు అదనపు హంగులను చేర్చినట్లు అయ్యింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇన్నాళ్లు కావాలనే రీజనల్ హీరోగా ఉండిపోయాడు. తాను తీయాలి అనుకుంటే పాన్ ఇండియా సినిమా ఎప్పుడో తీసి ఉండచ్చు. కానీ, మహేశ్ మాత్రం అటువైపుగా ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఒకేసారి పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిజానికి ఈ మూవీ కోసం రాజమౌళి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి రేంజ్ కూడా హాలీవుడ్ కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ జక్కన్న టేకింగ్ కి ఫిదా అయిపోయారు. అందుకే ఇప్పుడు మహేశ్ ప్రాజెక్ట్ ని కూడా పాన్ వరల్డ్ కథాంశంతోనే తెరెక్కిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్టే రూ.1000 కోట్లు అంటుంటే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈ సినిమా కోసం అటు మహేశ్ కూడా గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఒకసారి ఫారన్ అడవుల్లో ట్రెక్కింగ్ కూడా నేర్చుకుని వచ్చాడు.

ప్రస్తుతం మహేశ్ బాబు ఛేంజోవర్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాడీ ట్రాన్సర్మేషన్ కోసం వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఆ తాలూకు రిజల్ట్ మనం మహేశ్ ఫేస్ లో చూడచ్చు. తాజాగా మహేశ్ బాబు తన సోషల్ మీడియా పేజెస్ లో ఒక ఫొటో షేర్ చేశాడు. ఫేస్ మొత్తం మారిపోయినట్లు అనిపిస్తోంది. అలాగే పాత పిక్స్ తో పోలిస్తే ఫేస్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇది కచ్చితంగా ఫైనల్ లుక్ అయితే కాదు. కానీ, ఫైనల్ లుక్ ఎలా ఉండబోతోందో ఒక ఐడియా అయితే వస్తుంది. ఎలాంటి డౌట్ లేకుండా మహేశ్ బాబు లుక్స్ మాత్రం హాలీవుడ్ హీరోలను తలదన్నేలాగే ఉంటాయి. ఈ పిక్ చూసిన తర్వాత మహేశ్ ఫ్యాన్స్ అంతా.. ‘ఎవర్రా టామ్ క్రూజ్?’ అంటూ పోకిరి స్టైల్లో క్వశ్చనింగ్ చేసేస్తున్నారు.

ఇంక రాజమౌళి- మహేశ్ బాబు ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. ఈ మూవీ అడ్వెంచర్స్ కథ అని స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇండియానా జోన్స్ మూవీ తరహాలోనే ఈ సినిమా ఉంటుంది అన్నారు. అలాగే దాదాపుగా ఈ మూవీ షూటింగ్ అమెజాన్ అడవుల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం క్రూలో కూడా రాజమౌళి మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ మూవీ కోసం రాజమౌళి రెండేళ్లు డేట్స్ కావాలని కోరగా.. మహేశ్ బాబు మూడేళ్లు అయినా ఈ మూవీ కోసం కేటాయించేందుకు రెడీ అయిపోయారంట. అంటే ఈ సినిమాపై, కథపై, రాజమౌళిపై మహేశ్ కు ఎంత నమ్మకం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. మహేశ్ బాబు న్యూ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి