Nidhan
సూపర్‌స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్. ఈ ఫిల్మ్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్‌న్యూస్.
సూపర్‌స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్. ఈ ఫిల్మ్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్‌న్యూస్.
Nidhan
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఫిక్స్ కాని ఈ చిత్రాన్ని ‘ఎస్ఎస్ఎంబీ 29’గా పిలుస్తున్నారు. మహేష్ చేస్తున్న 29వ సినిమా కావడమే అలా పిలవడానికి రీజన్. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా సెట్స్ మీదకు వెళ్తే షూటింగ్ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్-జక్కన్న మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్. ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మహేష్‌తో చేయబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ఓ స్పెషల్ డే నాడు స్టార్ట్ చేయాలని దర్శకుడు రాజమౌళి ఫిక్స్ అయ్యారట. సూపర్‌స్టార్ పుట్టిన తేదీ అయిన ఆగస్టు 9వ తేదీన ‘ఎస్ఎస్ఎంబీ 29’ చిత్రీకరణను ప్రారంభించేందుకు ప్లాన్స్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మరింత వేగం పెంచారట. నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక, షూటింగ్ లొకేషన్స్ సెలక్షన్, మ్యూజిక్ సిట్టింగ్స్.. ఇలా అన్నింటినీ ఆగస్టులోపే పూర్తి చేయాలని జక్కన్న డిసైడ్ అయ్యారట. స్టోరీ, స్క్రీన్ లాక్ అయ్యాయి కాబట్టి డైలాగ్స్‌ను కూడా రెడీ చేయిస్తున్నట్లు వినికిడి. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను స్పీడ్‌గా ఫినిష్ చేసి.. ఆగస్టు 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టాలని రాజమౌళి అనుకుంటున్నారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నారట.
ఆగస్టు 9న ‘ఎస్ఎస్ఎంబీ 29’ షూట్ స్టార్ట్ అవనుందనే రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ భారీ సినిమా కావడం, హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కనుండటం, జక్కన్నది క్వాలిటీకి ఇంపార్టెంట్ ఇచ్చే మైండ్‌సెట్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఆయన ఎక్కువ టైమ్ తీసుకోవడంలో ఆశ్చర్యం లేదని అంతా అంటున్నారు. మహేష్ మూవీ స్టార్ట్ అయ్యేది ఆ రోజే అంటూ రూమర్స్ వైరల్ అవడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ ఆగస్టు 9న షూటింగ్ స్టార్ట్ అయితే మాత్రం మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అని అంటున్నారు. సూపర్‌స్టార్ బర్త్ వేడుకల జోష్‌లో ఉండే అభిమానులు.. ఆయన కొత్త చిత్రం ప్రకటనతో మరింత సంబురాలు చేసుకోవడం ఖాయం. మరి.. మహేష్-జక్కన్న మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఉపేంద్ర కొత్త పాట.. తెలుగు సెలబ్రిటీలపై సెటైర్లు వేస్తూ..
#MaheshBabu #SSRajamouli #SMB29 pic.twitter.com/8FcnsTdh6v
— Skyups Media (@skyupsMedia) March 5, 2024