iDreamPost
android-app
ios-app

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేశ్.. సైలెంట్ గా కానిచ్చేశారుగా..!

  • Published Mar 07, 2024 | 9:37 PM Updated Updated Mar 09, 2024 | 6:17 PM

Mahesh Babu- Anil Ravipudi: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం శ్రమిస్తున్నాడు. కానీ, టాలీవుడ్ వర్గాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో యాక్ట్ చేశాడు అంటున్నారు.

Mahesh Babu- Anil Ravipudi: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం శ్రమిస్తున్నాడు. కానీ, టాలీవుడ్ వర్గాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో యాక్ట్ చేశాడు అంటున్నారు.

  • Published Mar 07, 2024 | 9:37 PMUpdated Mar 09, 2024 | 6:17 PM
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేశ్.. సైలెంట్ గా కానిచ్చేశారుగా..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. అదేంటి ఇంకా రాజమౌళి ప్రాజెక్టు పట్టాలెక్కలేదుగా అప్పుడే బిజీ ఏంటి అనుకుంటున్నారా? రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించి ఛేంజోవర్, బాడీ ట్రాన్సర్మేషన్ పనిలో ఉన్నాడు. ఈ గ్యాప్ లో సేవా కార్యక్రమాలు, కమర్షియల్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే ఎవరికీ తెలియకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక షూట్ పూర్తి చేశారంట. అది కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేశ్ బాబు యాక్టింగ్ అని కోడై కూస్తోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాజమౌళి ప్రాజెక్ట్ మీదే పెట్టాడు. అయితే ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో షూటింగ్ అనగానే అంతా ఆశ్చర్యపోయారు. అదేంటి ఎస్ఎస్ఎంబీ 29 సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేశ్ బాబు యాక్ట్ చేసిన విషయం అయితే నిజమే అంటున్నారు. కానీ, మహేశ్ బాబు ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదంట. జరిగిన షూటింగ్ యాడ్ కోసం అంటున్నారు. అవును అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక యాడ్ షూట్ లో మహేశ్ బాబు నటించాడట. అందుకు సంబంధించిన వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది మాత్రం ఇది సినిమా షూటింగ్ అనుకుని కంగారు పడిపోతున్నారు.

అంత కంగారు ఏమీ అవసరం లేదు. ఇంక ఈ షూటింగ్ విషయానికి వస్తే.. సెట్స్ లో మహేశ్ బాబు- అనిల్ రావిపూడి సందడి చేశారంట. షూట్ మొత్తం నవ్వులు, పరాచకాలే అంటున్నారు. సాధారణంగానే మహేశ్- అనిల్ ఇద్దరూ నోరు తెరిస్తే పంచులు వచ్చేస్తాయి. మరి.. ఆ ఇద్దరూ ఒకే దగ్గర ఉంటే ఆ మాత్రం ఉంటది. ఇంక సినిమాల విషయానికి వస్తే.. మహేశ్ బాబు మాత్రం పూర్తి ఫోకస్ అంతా రాజమౌళి ప్రాజెక్ట్ మీదే పెట్టేశాడు. ఈ మూవీకి ‘మహారాజా’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలను రాజమౌళి కొట్టి పారేశాడు. ఇంకా ఎలాంటి టైటిల్ ఖరారు చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

సినిమా మాత్రం అమెజాన్ అడవుల్లో అడ్వెంచర్స్ గా ఉంటుంది అంటున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ట్రెక్కింగ్ కూడా చేసేస్తున్నాడు. ఒక విడత విదేశాలు వెళ్లి అడవుల్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. మరోవైపు లుక్స్, ట్రాన్సర్మేషన్ పనులు కూడా అవుతున్నాయి. ఈ మూవీ మాత్రం వరల్డ్ వైడ్ థీమ్, వరల్డ్ వైడ్ స్టాంర్డ్స్ తో జక్కన్న తీసేందుకు రెడీ అయిపోయాడు. ఈ మూవీలో హాలీవుడ్ తారలు కూడా తళుక్కుమంటారు. మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ మూడేళ్లు ఎంత త్వరగా గడిచిపోతాయా అంటూ ఎదురుచూస్తున్నారు. మరి.. అనిల్ రావిపూడి- మహేశ్ బాబు యాడ్ షూట్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet