iDreamPost
android-app
ios-app

Keerthy Suresh: కీర్తి సురేశ్‌తో ఉన్న ఈమె ఎవరో తెలుసా? తన కోసం ఏడుస్తూ ఎమోషనల్ పోస్ట్!

  • Published Aug 03, 2024 | 12:54 PM Updated Updated Aug 03, 2024 | 12:54 PM

Keerthy Suresh: మహానటి సావిత్రి ఇమేజ్ నుండి త్వరగానే బయటపడిన కీర్తి సురేష్.. ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుంది. అలాగే రఘుతాత ప్రమోషన్లలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. కీర్తి ఎమోషనల్ పోస్టు చేసింది ఎందుకంటే..?

Keerthy Suresh: మహానటి సావిత్రి ఇమేజ్ నుండి త్వరగానే బయటపడిన కీర్తి సురేష్.. ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుంది. అలాగే రఘుతాత ప్రమోషన్లలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. కీర్తి ఎమోషనల్ పోస్టు చేసింది ఎందుకంటే..?

  • Published Aug 03, 2024 | 12:54 PMUpdated Aug 03, 2024 | 12:54 PM
Keerthy Suresh: కీర్తి సురేశ్‌తో ఉన్న ఈమె ఎవరో తెలుసా? తన కోసం ఏడుస్తూ ఎమోషనల్ పోస్ట్!

సావిత్రినే తిరిగి వచ్చి నటించిందా అనిపించేలా మహానటి మూవీలో యాక్ట్ చేసింది కీర్తీ సురేష్. దీంతో అత్యంత చిన్న వయస్సులోనే జాతీయ అవార్డును కొల్లగొట్టింది. అయితే మహానటి/ సావిత్రి ముద్ర నుండి బయటపడటానికి బాగానే కసరత్తులు చేసింది. ఉమెన్ ఓరియంట్ చిత్రాలు ( చేసి సక్సెస్ పొందలేకపోయిన ఈ స్టార్..)చేసి అంతగా సక్సెస్ అందుకోలేకపోయిన ఈ స్టార్ హీరోయిన్.. ఇటీవల కల్కి 2898ఏడీ మూవీకి బుజ్జికి గొంతు అరువిచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు రఘు తాత సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కీర్తి సురేష్ నాని ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ కన్నా.. విజయ్ దళపతి సూపర్ డ్యాన్సర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో.. ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు ఆవేదనలో మునిగిపోయింది కీర్తి.

కీర్తి సురేశ్‌తో ఉన్న ఈమె ఎవరో తెలుసా..? తన కోసం ఏడుస్తూ ఎమోషనల్ పోస్టు చేసింది. ఎందుకంటే ఆమెను కోల్పోయింది కీర్తి. చిన్ననాటి స్నేహితురాల్ని కోల్పోయిన బాధలో మునిగిపోయింది. ఆమెను తలుచుకుంటూ ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టింది. గత నెలలో ఆమె మరణించగా.. ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతుంది కీర్తి. ఆమెను తలచుకుంటూ సుదీర్ఘమైన పోస్టులో పేర్కొంది. ‘ గత కొన్ని వారాలుగా మనస్సుకు చాలా కష్టంగా ఉంది. సర్ధిచెప్పుకోలేకపోతున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు మమ్మల్ని ఇంత త్వరగా వదిలి వెళ్లిపోవడాన్ని నమ్మలేకపోతున్నాను. 21 ఏళ్ల వయస్సులో తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. ఎనిమిది వారాల పాటు పోరాటం చేసింది. చివరకు గత నెలలో విధికి తలవంచింది. గత నవంబర్‌లో ఆమెకు మూడో సర్జరీ జరుగుతున్న సమయంలో ఎంతో ధైర్యంగా కనిపించింది. అలాంటి సంకల్ప శక్తి ఉన్నవారిని నేను ఇప్పటి వరకు చూడలేదు.

మేమిద్దం చివరి సారి కలిసిన సమయంలో నొప్పిని భరించలేనని ఏడ్చింది. ఆ సమయంలో ఆమెకు నేను ధైర్యం చెప్పి.. ఆ తర్వాత ఆసుపత్రి కారిడార్‌లో నేను నా భావోద్వేగాలను అణిచి పెట్టలేకపోయాను. ఏడ్చుకుంటూ వెళ్లాను. ఆమెను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు చూశాను. సరైన జీవితాన్ని ప్రారంభించని, ప్రపంచాన్ని చూడని, ఎన్నో కలలను నేరవేర్చుకోని ఇంత చిన్నమ్మాయికి ఇలా ఎందుకు జరిగిందని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. నా దగ్గర ఇంకా సమాధానం లేదు. ఆమె తన చివరి శ్వాస వరకు పోరాడింది. సరిగ్గా నెల రోజుల క్రితం మరణించింది. నీ గురించి ఆలోచించకుండా ఒక్క రోజు గడవదు.ఈ రోజు నీ పుట్టిన రోజు. ఈ రోజే కాదు నిన్ను ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటాను’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది కీర్తి సురేష్. రఘు తాత కాకుండా రివాల్వర్ రీటా, కన్నీవీడితో పాటు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బేబీ జాన్ మూవీలో నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom