iDreamPost
android-app
ios-app

ఇళయరాజాకు మళ్ళీ చుక్కెదురు! కోర్టులో పరువు పోయినంత పని అయ్యింది!

  • Published Apr 20, 2024 | 4:38 PM Updated Updated Apr 20, 2024 | 4:38 PM

Madras HC Shock for Ilayaraja: సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించి అందరి అభిమానాన్ని చూరగొన్న సంగీత దర్శకులు ఇళయ రాజా గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు సంగీత ప్రియులు.

Madras HC Shock for Ilayaraja: సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించి అందరి అభిమానాన్ని చూరగొన్న సంగీత దర్శకులు ఇళయ రాజా గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు సంగీత ప్రియులు.

ఇళయరాజాకు మళ్ళీ చుక్కెదురు! కోర్టులో పరువు పోయినంత పని అయ్యింది!

సినీ ఇండస్ట్రీలో సంగీత బ్రహ్మగా పేరు తెచ్చుకున్న సంగీత దర్శకులు ఇళయరాజా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. దాదాపు మూడు దశబ్దాలుగా ఆయన ఇండస్ట్రీకి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ.. ప్రేక్షకుల మనసు దోచేస్తున్నారు. ఆయన స్వరపరిచిన పాట ఏదైనా సరే సూపర్ హిట్ కావాల్సిందే. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలకు సూపర్ హిట్స్  అందించారు. ప్రేమ, విరహం, భక్తి, మెలోడీ, ఫోక్ ఇలా ఏ పాట కంపోజ్ చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేక ఉండేది. ఎంతగా అంటే కొన్ని సినిమాలు కేవలం పాటలతోనే హిట్ అయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఇళయరాజాపై కొంత కాలంగా తన పాటలపై ‘కాపీ రైట్స్’ విషయంలో పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ కేసు విషయంలో కోర్టులో ఆయనకు చుక్కెదురయ్యాంది. వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు అందించి తనదైన మార్క్ చాటుకున్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా. ఆయన పాటలకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ప్రస్తుతం ఇళయరాజా రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. గతంలో ఎలాంటి కాంట్రవర్సీ లేని ఆయన ఈ మధ్య వరుస కాంట్రవర్సీలతో సతమతమవుతున్నారు. తాజాగా మద్రాస్ హై కోర్ట్ ఇళయరాజపై సంచలన కామెంట్స్ చేసింది. ‘ఇళయ రాజ గొప్పవారే కానీ.. అందరి కంటే పెద్ద గొప్పవారు మాత్రం కాదు’ అంటూ మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి అన్నారు. ఇటీవల ఇళయరాజ పాటలను తన సినిమా పాటల హక్కులను సొంతం చేసుకున్న క్యాసెట్లు, సీడీలు, ఆన్ లైన్ జ్యక్ బాక్సుల ద్వారా వ్యాపారం చేసిన ఎకో తదితర సంస్థలకు గడువు ముగిసిందని.. వాటికి సంబంధించిన కాపీ రైట్స్ తనకే చెందేలా తీర్పు ఇవ్వాలని ఇళయరాజా కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇళయరాజా వేసిన పిటీషన్ కి కౌంటర్ గా సదరు కంపెనీ ప్రతినిధులు తమకుఅనుకూలంగా జడ్జ్ మెంట్ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కాపీ రైట్స్ ఇళయరాజాకు చెందవని.. సందరు సంస్థలు ఆయా ఆల్బామ్స్ ని వాడుకోవచ్చు అని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ విషయంపైనే ఇళయ రాజా తరుపు లాయర్ కోర్టులో వాదిస్తూ.. తన క్లయింట్ ఒక మామూలు వ్యక్తి కాదని.. ఆయన ఎంతో గొప్పవాడని చెప్పుకోచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘సంగీత త్రిమూర్తులుగా చెప్పుకునే ముత్తు స్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామ శాస్త్రి కంంటే ఇళయరాజా గొప్పవారేమీ కాదు’ అని అన్నారు. దీంతో కోర్టులో ఆయన పరువు పోయినంత పని అయ్యిందని అంటున్నారు.  ఈ కేసు బుధవారానికి వాయిదా వేశారు.